కరకట్టలతో భూగర్భ జలాలు పెంచుదాం

ABN , First Publish Date - 2022-05-14T06:00:00+05:30 IST

కరకట్టలతో భూగర్భ జలాలు పెంచుదాం

కరకట్టలతో భూగర్భ జలాలు పెంచుదాం
సమావేశంలో మాట్లాడుతున్న ఏపీడీ కొండల్‌ రెడ్డి

‘పల్లెప్రగతి’ని విజయవంతం చేయాలి

ఏపీడీ కొండల్‌ రెడ్డి

స్టేషన్‌ఘన్‌పూర్‌, మే 13: వర్షాలు కురిసినప్పుడు వచ్చే వరద నీటిని వాటర్‌ షెడ్‌ పథకంలో భాగంగా కరకట్టలు పోసి భూమిలోకి ఇంకేలా చేసినట్లైతే భూగర్భ జలాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందని ఏపీడీ కొండల్‌రెడ్డి తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం హరితహారం, పల్లెప్రగతి, తాటికొండ వాటర్‌షెడ్‌ పథకంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలోని 14 గ్రామాలతో తాటికొండ వాటర్‌ షెడ్‌ పథకంను రూపొందించడం జరిగిందన్నారు. పథకం ద్వారా వర్షం ద్వారా వచ్చే నీరు వృథా కాకుండా అవసరం ఉన్న చోట కరకట్టలను కట్టడం, ఫాంపాండ్స్‌ నిర్మాణాలను చేయడం గాని జరుగుతుందన్నారు. ఈ నెల 20 నుంచి వచ్చే నెల 5వ తేది వరకు జరిగే పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పల్లెప్రగతిలో చేయాల్సిన పనులను గుర్తించాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున హరితహారంలో భాగంగా మొక్కలను నాటేందుకు సంసిద్ధం కావాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కుమారస్వామి, ఎంపీవో సుధీర్‌కుమార్‌, వాటర్‌ షెడ్‌ పథకం ప్రాజెక్టు మేనేజర్‌ వీరయ్య, ఏపీవో ప్రేమయ్య, సతీష్‌, కార్యదర్శులు వేణు, అశ్విన్‌, అవినాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more