ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

KCRకు అమిత్‌షా సవాల్

ABN, First Publish Date - 2022-05-15T02:15:14+05:30

KCRకు అమిత్‌షా సవాల్

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్: రజాకార్ల ఒడిలో కూర్చున్న కేసీఆర్‌ను గద్దె దించేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినట్టు కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. తుక్కుగూడ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో కేసీఆర్ లాంటి అసమర్థ సీఎంను చూడలేదన్నారు. బాయిల్డ్‌ రైస్ కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. కేసీఆర్ చెప్పినట్లు రాష్ట్రం బంగారు తెలంగాణ అయిందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కేంద్ర పథకాల పేర్లు మార్చడం తప్ప కేసీఆర్ ఈ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు.


కేంద్రం ఇచ్చిన సంక్షేమ పథకాలను కేసీఆర్‌ అమలుచేయాలని అన్నారు. వరంగల్‌ సైనిక్‌ స్కూల్‌కు 2016లో అనుమతి ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందన లేదని షా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఎనిమిదేళ్లలో రూ.2.52 లక్షల కోట్లు ఇచ్చామని అమిత్‌షా తెలిపారు.  తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, మీరు సిద్ధమా? అని కేసీఆర్‌కు షా సవాలు విసిరారు. అధికారంలోకి రాగానే ప్రతి గింజా కొంటామని తెలిపారు. తన మాటలు వింటుంటే కేసీఆర్‌కు భయం పట్టుకుందని అమిత్‌షా అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!