అట్టర్‌ఫ్లాప్‌ అవుతున్న భారీ బడ్జెట్‌ సినిమాల్లా.. కేసీఆర్‌ ప్రభుత్వ బడ్జెట్‌లు: లక్ష్మణ్‌

ABN , First Publish Date - 2022-05-14T08:30:56+05:30 IST

అట్టర్‌ఫ్లాప్‌ అవుతున్న భారీ బడ్జెట్‌ సినిమాల్లాగా కేసీఆర్‌ ప్రభుత్వ బడ్జెట్‌లు మారుతున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు.

అట్టర్‌ఫ్లాప్‌ అవుతున్న భారీ బడ్జెట్‌ సినిమాల్లా.. కేసీఆర్‌ ప్రభుత్వ బడ్జెట్‌లు: లక్ష్మణ్‌

హైదరాబాద్‌, మే 13(ఆంధ్రజ్యోతి): అట్టర్‌ఫ్లాప్‌ అవుతున్న భారీ బడ్జెట్‌ సినిమాల్లాగా కేసీఆర్‌ ప్రభుత్వ బడ్జెట్‌లు మారుతున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. అనుకున్నదానికంటే ఎక్కువ అప్పులు చేయడం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఘనత అని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లు అంచనాలు ఘనం.. ఆదాయం అధమం అని ఆరోపించారు. శుక్రవారం, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, వాస్తవికతను విస్మరించి, అంచనాలను అతిగా చూపి, ప్రజలను మభ్యపెడుతోందన్నారు. 2020-21 బడ్జెట్‌లో అంచనాకు, వాస్తవికతకు రూ. 50వేల కోట్ల వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. కేంద్ర నిధులు దారి మళ్లించడం రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు.  

Read more