ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-05-10T05:34:28+05:30

గిరిజన గ్రామాలలో నెలకొన్న సామాజిక సమస్యలను పరిష్కరించాలంటూ ఆదివాసీ గిరిజన గ్రామాల ప్రజలు ఐటీడీఏ వరకు సోమవారం పాదయాత్ర నిర్వహించారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సం ఘం ఆధ్వర్యంలో మండలంలోని ఎర్రగుట్ట, చాప్రాల గ్రామాల ప్రజలతో పాటు ఆయా గ్రామాల నుంచి పిల్లపాపలతో, ఖాళీ బిందెలతో ఐదు, ఆరు కిలోమీటర్ల మేర ఆదివాసీ డోళ్లతో తరలి వచ్చారు. ఐటీడీఏ

ఐటీడీఏకు పాదయాత్రగా తరలి వస్తున్న ఆదివాసీ గిరిజనులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఉట్నూర్‌, మే 9: గిరిజన గ్రామాలలో నెలకొన్న సామాజిక సమస్యలను పరిష్కరించాలంటూ ఆదివాసీ గిరిజన గ్రామాల ప్రజలు ఐటీడీఏ వరకు సోమవారం పాదయాత్ర నిర్వహించారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సం ఘం ఆధ్వర్యంలో మండలంలోని ఎర్రగుట్ట, చాప్రాల గ్రామాల ప్రజలతో పాటు ఆయా గ్రామాల నుంచి పిల్లపాపలతో, ఖాళీ బిందెలతో ఐదు, ఆరు కిలోమీటర్ల మేర ఆదివాసీ  డోళ్లతో తరలి వచ్చారు. ఐటీడీఏ  కార్యాలయం ఆవరణలోని గిరిజన దర్భార్‌ వద్ద  ధర్నా నిర్వహించారు. ఘన్‌పూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చాప్రాల గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయ ని గ్రామ పటేల్‌ తొడసం దేవ్‌రావు అన్నారు. నెల రోజులుగా తమ సమస్యలపై ప్రతీ సోమవారం ధర్నాలు నిర్వహిస్తున్నా.. ఐటీడీఏ అధికారులు సమ స్యలు పరిష్కరిస్తున్నామంటూనే కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పాదయాత్ర చేపట్టామన్నారు. మత్తడిగూడ నుంచి చాప్రాల వరకు ఐదు కిలో మీటర్లు రోడ్డు మంజూరు చేయాలని, గ్రామంలో రెండు బోర్లు వేసి మోటార్లు బిగించి ట్యాంకు ద్వారా నీరు సరఫరా చేయాలని, గ్రామంలోని గిరిజనులందరికీ ఉపాధి హామీ జాబ్‌కార్డులు ఇవ్వాలని, మినీ అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసి గ్రామంలో సీసీ రోడ్లు  నిర్మించాలని, అర్హులైన ప్రతీ గిరిజన కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇవ్వాలని, వృధ్యాప్య, అర్హులకు వితంతు పింఛన్‌లు  మంజూరు చేయాలని కోరారు. ఇది ఇలా ఉండగా కన్నాపూర్‌ పంచాయతీ పరిధిలో ఉన్న కొలాం గిరిజనులు నివసిస్తున్న ఎర్రగుట్ట గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక  ఇబ్బంది పండుతున్నామని గ్రామ పటేల్‌ ఆత్రం సోనేరావు అన్నారు. గ్రామంలో మిషన్‌ భగీరథ ట్యాంకు ఉన్నా.. ఒక్కరోజు కూడా నీళ్లు రాలేదని, చెలిమెల నీరు తాగుతూ అనారోగ్యం పాలవుతున్నామని వాపోయారు. గ్రామానికి రోడ్డు, కరెంట్‌, తాగునీటి సౌకార్యాలు కల్పించాలని పలు డిమాండ్లు వ్యక్తం చేశారు. దీంతో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కొందరు గిరిజనులను పిలిచి సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో  గిరిజనులు వెనుదిరిగారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పూసం సచిన్‌, జిల్లా ఉపాధ్యక్షుడు లంక రాఘవులు, మండల అధ్యక్షుడు కనక మల్కు, ఆత్రం బల్లార్షా, మడా వి నాగోరావు, కుర్సింగ జల్పతి, ఆత్రం భుజంగ్‌రావు, తదితరులు ఉన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!