ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలి

ABN, First Publish Date - 2022-05-14T04:22:04+05:30

నిరుద్యోగులు కష్టపడి చదివి ఉద్యోగాలను సాధించాలని ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పేర్కొన్నారు. శుక్రవారం చెన్నూరు పట్టణంలోని జయశంకర్‌ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం కోచింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. విప్‌ మాట్లాడుతూ ఆత్మ విశ్వాసంతో కష్టపడి చదివితే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు. ప్రణాళికా బద్ధంగా చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. 95 శాతం ఉద్యోగాలు స్ధానికులకే కల్పించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని తెలిపారు.

మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

 చెన్నూరు, మే 13:  నిరుద్యోగులు కష్టపడి చదివి ఉద్యోగాలను సాధించాలని ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పేర్కొన్నారు. శుక్రవారం చెన్నూరు పట్టణంలోని జయశంకర్‌ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత కోసం కోచింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. విప్‌ మాట్లాడుతూ ఆత్మ విశ్వాసంతో కష్టపడి చదివితే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు. ప్రణాళికా బద్ధంగా చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. 95 శాతం ఉద్యోగాలు స్ధానికులకే కల్పించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని తెలిపారు. నిరుద్యోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లి కోచింగ్‌ తీసుకునే ఆర్థిక స్ధోమత లేక ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి ఉచిత కోచింగ్‌ సెంటర్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఉచిత కోచింగ్‌తోపాటు మధ్యాహ్న భోజనం, స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేస్తున్నామన్నారు. లక్ష్యాన్ని సాధించే వరకు ఇంటర్నెట్‌, సినిమాలు, ఫోన్‌లకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు.  కలెక్టర్‌ భారతి హోళికేరీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అర్చనగిల్డా, నాయకులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.

ఆసుపత్రి నిర్మాణ పనుల పరిశీలన

ప్రజలకు వైద్య సేవలను మరింత చేర వేసేందుకు చెన్నూరులో రూ.7 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తున్నామని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పేర్కొ న్నారు. శుక్రవారం కలెక్టర్‌ భారతి హోళికేరీతో కలిసి ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. విప్‌ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, ఆరోగ్యం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ఆసుపత్రి నిర్మాణం త్వరలో పూర్తి చేసి వైద్య సేవలు అందిస్తామన్నారు. అనంతరం పట్టణంలో రూ. 7.20 కోట్లతో ఏర్పాటు చేస్తున్న సమీకృత మార్కెట్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రజలకు కూరగాయలు, మాంసం అన్ని ఒకే చోట లభించే విధంగా మార్కెట్‌ నిర్మాణం, కోల్ట్‌ స్టోరేజీ పాయింట్‌ను ఏర్పాటు చేస్తామ న్నారు. అనంతరం బాల్క ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్‌ సెంటర్‌ను పరిశీలించారు. కలెక్టర్‌  మాట్లాడుతూ నిరుద్యోగులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలన్నారు.   

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!