రూ. 11 కోట్లతో అడెల్లి మహా పోచమ్మ ఆలయ పునర్నిర్మాణం
ABN , First Publish Date - 2022-05-05T06:52:57+05:30 IST
మండలంలోని అడెల్లి మహాపోచమ్మ ఆల యాన్ని రూ. 11 కోట్లతో పునర్నిర్మిస్తున్నట్లు న్యాయ, పర్యావరణ, అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.
కృష్ణశిలలతో ఆలయ నిర్మాణం
దశల వారీగా అభివృద్ధి పనులు
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
సారంగాపూర్, మే 4 : మండలంలోని అడెల్లి మహాపోచమ్మ ఆల యాన్ని రూ. 11 కోట్లతో పునర్నిర్మిస్తున్నట్లు న్యాయ, పర్యావరణ, అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. బుధవారం మంత్రి అల్లోల అడెల్లి పోచమ్మను ఆలయాన్ని దర్శించుకొని.. అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అడెల్లి పోచమ్మ ఆల యానికి మొక్కులు తీర్చుకోవడానికి వచ్చే భక్తుల కు అన్ని వసతులు, సౌకర్యాలను కల్పిస్తున్నామ న్నారు. ఆలయ విస్తరణ నిర్మాణం చేపట్టనుండ డంతో బాలాలయం నుంచి భక్తులకు అమ్మ వారిని దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాల న్నారు. యాదాద్రి తరహాలో కృష్ణశిలలతో ఆలయ నిర్మాణం జరగనున్నట్లు మంత్రి తెలిపారు. అద్భు తమైన శిల్పాలతో అమ్మవారి ఆలయం కొత్త రూపా న్ని సంతరించుకోనుందని పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో మంత్రి అల్లోల సోదరుడు అల్లోల మురళీఽ దర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి రామ్‌కిషన్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ వెంకట్ రామ్‌రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఆలయ చైర్మన్ ఐటీ చందు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజ్‌మహ్మద్, మాజీ ఆడెల్లి దేవాలయం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మాధవ్‌రావులతో పాటు నాయకులు, ఆలయ సిబ్బందిలు ఉన్నారు.

