ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

సామూహిక చర్చలతో విజ్ఞానం పెరుగుతుంది

ABN, First Publish Date - 2022-05-14T06:50:25+05:30

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు తమ లక్ష్యం సాధించాలంటే ఏకాగ్రత అవసరమని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ సూచించారు.

నిరుద్యోగులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

లక్ష్యం సాధించాలంటే ఏకాగ్రత అవసరం 

కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

నిర్మల్‌ కల్చరల్‌, మే 13 : పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు తమ లక్ష్యం సాధించాలంటే ఏకాగ్రత అవసరమని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ సూచించారు. శుక్రవారం ఆయన జిల్లా గ్రంథాలయం సందర్శించి పోటీ పరీక్ష లకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో కాసేపు ముచ్చటించారు. అభ్యర్థులు విష యం పరిజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు. సామూహిక చర్చలకు ప్రాధాన్య మిస్తే మరింత జ్ఞానం పెరుగుతుందన్నారు. ప్రణాళికాబద్ధంగా చదవాలని, చదువల్లో గ్యాప్‌ ఇవ్వరాదన్నారు. ఒకరి విజ్ఞానం మరొకరు పంచుకోవాల న్నారు. అదే పనిగా కాకుండా మధ్య మధ్య విరామం తీసుకుని చదవాలన్నా రు. ఒకే పరీక్షకు కాకుండా అనేక పోటీ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. నిరుత్సాహ పడకుండా పదేపదే నిరంతరం విజ్ఞాన సముపార్జనతో లక్ష్యం సాధించవచ్చునని అన్నారు. ఐఏఎస్‌కు ప్రిపేరైనా సమయంలో తన స్వీయ అనుభవాలు వారితో పంచుకున్నారు. నిర్మల్‌ గ్రంథాలయానికి 50 కుర్చీలను అడిగిన తడవుగానే మంజూరు చేశారు. అన్ని సౌకర్యాలు కల్పించి అండగా ఉంటామని అభ్యర్థులు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించా రు. చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!