ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పాఠ్యాంశాల బోధ న, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

ABN, First Publish Date - 2022-11-07T22:23:20+05:30

కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థినులకు పాఠ్యాంశాల బోధన, ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక శ్రద్ధ వహిం చాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయ న చాంబర్‌లో సెక్టోరల్‌ అధికారి పద్మజ, సఫ్దర్‌ఆలీఖాన్‌, శ్రీనివాస్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 7: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థినులకు పాఠ్యాంశాల బోధన, ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక శ్రద్ధ వహిం చాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయ న చాంబర్‌లో సెక్టోరల్‌ అధికారి పద్మజ, సఫ్దర్‌ఆలీఖాన్‌, శ్రీనివాస్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 10వ తరగతి విద్యార్థులకు సిలబస్‌ను పూర్తి చేసి రివిజన్‌, వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని సూచించారు. పాఠ్యాంశాల్లోని భాషలకు సంబంధించిన ప్రాథమిక అంశాలు, గ్రామర్‌ నేర్పించాలన్నారు. ప్రతీ ఆదివారం పరీక్షలు నిర్వహించి విద్యార్థుల శక్తి సామర్ధ్యాలను పెంపొందించా లన్నారు. మెనూ ప్రకారం ఆహారాన్ని ఇవ్వాలన్నారు.

మండలాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ ప్రజా సంక్షేమం దిశగా కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ అన్నారు. కలెక్టరేట్‌లో మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలతో గూగుల్‌ మీట్‌ నిర్వహించారు. అద నపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేస్తూ ఎంపీ డీవో కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అం దుబాటులో ఉండాలన్నారు. ప్రజావాణిలో పాల్గొనే మండల స్థాయి అధికారుల వివరాలు కలెక్టర్‌ కార్యాలయంలో పరిపాలన అధికారికి అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించాలన్నారు. క్రీడా ప్రాంగణాలు, మన ఊరు-మన బడి, తెలంగాణకు హరితహారం, ఉపాధిహామీ, పారిశుధ్యంపై దృష్టి సారింలన్నారు.

జిల్లాలోని 7 పుురపాలక సంఘాల పరిధిలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో మున్సిపల్‌ కమిషనర్లు, ఇంజనీరింగ్‌, ప్రణాళిక విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. క్రీడా ప్రాంగణాలను వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. పొడి, తడి చెత్తలతో పాటు ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలించాలని, మురుగు కాలువలలో పూడిక తీసి శుభ్రంగా ఉండేలా దృష్టి సారించాలన్నారు. పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా చూడాలని తెలిపారు.

Updated Date - 2022-11-07T22:23:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!