ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పశుగ్రాసం కొరత

ABN, First Publish Date - 2022-05-10T04:25:59+05:30

ఆరుగాలం రైతులకు వ్యవసాయంలో తోడ్పడే కాడెద్దులకు మేత కరువవుతోంది. కాడెద్దులకు సరిపడా పశుగ్రాసం దొరకకపోవడంతో రైతు లు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఆర్థికంగా భారమైన వేలు ఖర్చు పెట్టి గడ్డిని ఇతర ప్రాంతాల్లో కొనుగోలు చేసి పశువులను సాకు తున్నారు.

పశుగ్రాసం కొనుగోలు చేసి ఎడ్లబండ్లలో తీసుకెళ్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

- అల్లాడుతున్న మూగజీవాలు 

- భారీగా పెరిగిన గడ్డి ధరలు

- అన్నదాతల అవస్థలు 

- పట్టించుకోని అధికారులు 

ఆరుగాలం రైతులకు వ్యవసాయంలో తోడ్పడే కాడెద్దులకు మేత కరువవుతోంది. కాడెద్దులకు సరిపడా పశుగ్రాసం దొరకకపోవడంతో రైతు లు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఆర్థికంగా భారమైన వేలు ఖర్చు పెట్టి గడ్డిని ఇతర ప్రాంతాల్లో కొనుగోలు చేసి పశువులను సాకు తున్నారు. 

కౌటాల, మే 9:  జిల్లాలో పశు సంపదకు సరిపడా పశుగ్రాసం దొరక డం లేదు. వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులతో పశుగ్రాసం దొరకని దుస్థితి నెలకొంది. మూగజీవాలకు కడుపు నిండ మేత దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. రైతులకు పశువుల పోషణ భారంగా మారిం ది. రైతు కుటుం బాలకు ఆసరాగా నిలిచిన పశువులకు సరైన మేతను అందించడంలో అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడ్డి ధరలు కూడా ఆకాశన్నంటి కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. 

- కుమరం భీం జిల్లాలో..

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అన్ని రకాల పశువులు 11,38,675 ఉన్నాయి. వీటిలో ఆవులు, ఎద్దులు 2,64,451, గేదెలు 49,445, గొర్రెలు 1,60,954, మేకలు 2,59,539 ఉన్నాయి.  వేసవి ఎండలు ముదిరిపోయి భూగర్భ జలాలు అడుగంటిపోగా పశువులకు వేసే పచ్చిగడ్డి, పశుగ్రాసం తగ్గిపోయింది. వరి, మొక్కజొన్న, జొన్న పంటలను సాగు చేయడం వల్ల పశువులకు మేత లభించేది. ప్రస్తుతం పత్తి, వరి పంటలు పెరగడం, ఇతర పంటల సాగు విస్తీర్ణం తగ్గినందున పశుగ్రాసం కొరత ఏర్పడింది.

- రైతుల పాట్లు..

పాడి పశువులను కాపాడుకోవడానికి రైతులు నానా పాట్లు పడుతున్నారు. గేదెలు, ఎద్దులు ఇప్పటికే తగ్గుముఖం పట్టగా మిగిలిన కొద్ది పాటి పశువులకు పశుగ్రాసం కొరత పట్టిపీడిస్తోంది. మూగజీవా లను సాకడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టతరంగా తయారైంది. పశుగ్రాసం కొరత ఒకవైపు వెంటాడుతుండగా మరొవైపు నీటి సమస్య ఇబ్బం దికరంగా తయారైంది. వేసవి ఎండలతో ఇప్పటికే చెరువులు, కుంటల్లో నీరు అడుగంటిపోయాయి. ఆయా ప్రాంతాల్లో నీటి తొట్టిలను ఏర్పాటు చేసినా వాటిలో నీరు నింపకపోవడంతో పశువులు దాహార్తితో తల్లడిల్లిపోతున్నాయి. 

- భగ్గుమంటున్న ధరలు..

పశుగ్రాసం ధరలు భగ్గుమంటున్నాయి. వరి గడ్డి ట్రాక్టర్‌ లోడు 5,000 రూపాయల వరకు, ఎడ్ల బండి గడ్డి 3,000 నుంచి 3,500 రూ పాయల వరకు పలుకుతోంది. వరి గడ్డి యంత్రం కట్టిన వరి గడ్డి కట్ట 85 రూపాయలు, మొక్కజొన్న, జొన్న కట్ట 50 నుంచి 60 రూపాయల వరకు ఉంది. పచ్చి గడ్డి మోపు 70 నుంచి 90 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. పెంచుతున్న పచ్చి గడ్డి ఒక గుంట విస్తీర్ణానికి వెయ్యి రూపాయలకు లభిస్తోంది. పాల వ్యాపారం చేసే వారు రోజు గెదేలకు, ఆవులకు పచ్చి గడ్డి వేస్తారు. సరైన మేత లభించకపోతే పాల దిగుబడి పడిపోతుంది. తొలకరి కురిసి నేల మీద పచ్చికబయళ్లు వచ్చే వరకు పశుగ్రాసానికి రైతులు ఇబ్బందులు పడాల్సిందే.


పశుగ్రాసం కోసం ఇబ్బందులు పడుతున్నాం..

- గణపతి, కౌటాల

వేసవిలో పశువులకు గ్రాసం కోసం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లిఫ్టు ఇరిగేషన్‌ కింద పంటలు సాగు చేసిన రైతుల నుంచి అధికంగా డ బ్బులు వెచ్చించి ఎడ్లబండ్లలో గ్రామానిని తెచ్చుకుంటున్నాం. ముందుగా వెళ్లి డబ్బులు చెల్లించిన వారికే అక్కడ పశుగ్రాసం ఇస్తున్నారు. 


సబ్సిడీపై పశుగ్రాసం అందించాలి..

- తుకారాం, రైతు

పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉన్నందున ప్రభుత్వం రైతులకు సబ్సి డీపై అందించాలి. రియల్‌ వ్యాపారం పుంజుకోవడంతో సాగు భూములు తగ్గిపోతున్నాయి. పంటల సాగు విస్తీర్ణం తగ్గడంతో పశుగ్రాసం కొరత ఉంది.  అధికంగా డబ్బులు వెచ్చించి ఇతర ప్రాంతాల నుంచి పశుగ్రా సం తెప్పించుకోలేని పశు పోషకులు మూగజీవాలను కబేళాలకు విక్ర యించుకోవల్సిన దుస్థితి నెలకొంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!