ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

క్యాన్సర్‌ను ప్రాథమిక స్థాయిలో గుర్తించాలి

ABN, First Publish Date - 2022-05-07T04:21:13+05:30

క్యాన్సర్‌ వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తించి చికిత్స తీసుకుంటే మేలు అని కలెక్టర్‌ భారతి హోళికేరీ అన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ భారతి హోళికేరీ
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

- కలెక్టర్‌ భారతి హోళికేరీ
మంచిర్యాల కలెక్టరేట్‌, మే 6: క్యాన్సర్‌ వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తించి చికిత్స తీసుకుంటే మేలు అని కలెక్టర్‌ భారతి హోళికేరీ అన్నారు.  జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన క్యాన్సర్‌ వ్యాధి పరీక్ష కేంద్రాన్ని ఎమ్మెల్యే నడిపెల్లి దవాకర్‌రావు, డీఎంహెచ్‌వో సుబ్బారాయుడు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అరవింద్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళల్లో సాధారణంగా వచ్చే అవకాశం ఉన్న గర్భసంచి, రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధి తీవ్రతను చాలా వరకు తగ్గించుకోవచ్చని తెలిపారు. చాలామందిలో అవగాహన లేమి ఉంటుందన్నారు. ఒక వేళ అవగాహన్న ఉన్నా బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న మహిళలు ఈ డిటెన్షన్‌ సెంటర్‌ను సద్వినియోగం చేసుకుని పరీక్షలు చేసుకోవాలన్నారు. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స పొందినట్లయితే సమస్య తీవ్రతరం కాకుండా ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు. 9 నుంచి 30 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఖచ్చితంగా క్యాన్సర్‌ నిరోధక టీకా తీసుకోవాలని చెప్పారు. 30 నుంచి 60 సంవత్సరాల గల వారు ఐదేళ్లకు ఒకసారి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!