నలుపెక్కిన రేషన్ బియ్యం
ABN, First Publish Date - 2022-05-15T04:20:43+05:30
మండల ఏజెన్సీలో రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సరఫరా చేసిన బియ్యం వండగా నల్లగా జిగటగా మార డం కలకలం రేపింది.
- వండిన తర్వాత నల్లగా మారుతన్న వైనం
- అంతు చిక్కని మిస్టరీ
- కలర్, కెమికల్, పాలిష్ వల్లేనని అనుమానాలు
జైనూరు, మే 14: మండల ఏజెన్సీలో రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సరఫరా చేసిన బియ్యం వండగా నల్లగా జిగటగా మార డం కలకలం రేపింది. అన్నం తినడానికి వీలు లేకుండా తయారవు తోంది. రేషన్ దుకాణంలో ఒకరిద్దరికి కాదు అనేక మందికి ఇలాంటి నాసిక రకం బియ్యం పంపిణీ చేశారు. మండలంలోని భుసిమెట్ట, భుసిమెట్ట క్యాంపు గ్రామాల్లో ప్రభుత్వపరంగా సప్లై చేసిన రేషన్ బియ్యం ఈ విధంగా మారుతోంది. రేషన్ దుకా ణంలో సప్లై చేసిన బియ్యం ప్లాస్టిక్ బియ్యం వలె ఉన్నాయని వాటని వండినప్పుడు రంగుమారి ముద్దగా తయారవు తోందని వారు పేర్కొంటున్నారు. ఈ బియ్యాన్ని పాలిష్ చేసి, కెమికల్ కలిపి ఉండొచ్చునని లబ్ధిదారులు అనుమానం వ్యక్తం చేస్తు న్నారు. బియ్యం వండి తిన్నప్పుడు రుచి కూడా అనిపించడం లేదని వారు చెబుతు న్నారు. ప్రభుత్వం స్పందించి నాణ్యమైన రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ఆయా గ్రామాల లబ్ధిదారులు కోరుతున్నారు.