ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఎంఎంటీఎస్‌లో ‘ఫస్ట్‌క్లాస్‌’ చార్జీలు 50% తగ్గింపు

ABN, First Publish Date - 2022-05-04T08:10:59+05:30

జంట నగరాల్లో ఎంఎంటీఎస్‌ (మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్టు సర్వీసు) రైళ్లలో ఫస్ట్‌ క్లాస్‌లో సింగిల్‌ జర్నీ ప్రయాణికులకు చార్జీల్లో 50 శాతం తగ్గించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

రేపటి నుంచి అమల్లోకి

హైదరాబాద్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): జంట నగరాల్లో ఎంఎంటీఎస్‌ (మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్టు సర్వీసు) రైళ్లలో ఫస్ట్‌ క్లాస్‌లో సింగిల్‌ జర్నీ ప్రయాణికులకు చార్జీల్లో 50 శాతం తగ్గించారు. ఈ తగ్గింపును గురువారం నుంచి అమలు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ అనంతరం ఎంఎంటీఎస్‌ సర్వీసులను పునరుద్ధరించడంతో పాటు శివారు ప్రాంతాల ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా సర్వీసుల సంఖ్యను క్రమంగా పెంచుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఫలక్‌నుమా- సికింద్రాబాద్‌- హైదరాబాద్‌- బేగంపేట- లింగంపల్లి- తెల్లాపూర్‌- రామచంద్రాపురం మధ్య 29 రైల్వే స్టేషన్లను కవర్‌ చేస్తూ దాదాపు 50 కిలోమీటర్ల మేర 86 సర్వీసులను నడుపుతున్నట్లు వివరించారు.


ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో జంట నగరాల్లోని ప్రయాణికులు తగ్గింపు చార్జీలతో ఎంఎంటీఎస్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని దక్షిణమధ్య రైల్వే ఇన్‌చార్జ్‌ జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ సూచించారు. ప్రతి ఎంఎంటీఎ్‌సలో 1, 2 ఫస్ట్‌ క్లాస్‌ బోగీలుప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!