-
-
Home » Technology » USB device-NGTS-Navya
-
యుఎస్బీ డివైస్ వాడుతున్నారా మాల్వేర్తో జాగ్రత్త!
ABN , First Publish Date - 2022-05-14T08:38:15+05:30 IST
ఇన్ఫెక్టడ్ యుఎస్బీ డ్రైవ్ ద్వారా డివైస్‌ల్లోకి ‘రాస్ప్బెర్రీ రాబిన్’ పేరిట ఒక మాల్వేర్ ప్రవేశించి అల్లకల్లోలం చేస్తోందని సమాచారం.

ఇన్ఫెక్టడ్ యుఎస్బీ డ్రైవ్ ద్వారా డివైస్‌ల్లోకి ‘రాస్ప్బెర్రీ రాబిన్’ పేరిట ఒక మాల్వేర్ ప్రవేశించి అల్లకల్లోలం చేస్తోందని సమాచారం. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు అది ఎలా జరుగుతోందన్నది మాత్రం వారు చెప్పలేకపోతున్నట్టు రాయిటర్స్ కథనం. ఈ మాల్వేర్కు నిజానికి పేరుపెట్టలేదు. అయితే ఆ మాల్వేర్ ‘రాస్ప్బెర్రీ రాబిన్ ’ గ్రూప్‌నకు చెందిందనే అంటున్నారు. పరిశోధకుల కథనం ప్రకారం, ఝజీట్ఛ్ఠ్ఛఛి.్ఛ్ఠ్ఛ డౌన్లోడ్ చేసి లెజిటిమేట్ ఇన్స్టాలర్ ప్యాకేజీలను ఎగ్జిక్యూట్(అమలు) చేస్తున్నప్పుడు యాడ్వర్సరీలు మాల్వేర్ను డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ‘రాస్ప్బెర్రీ రాబిన్ ’ ప్రధానంగా ఎక్స్టర్నల్ నెట్వర్క్ కమ్యూనికేషన్స్ ద్వారా ప్రవేశించే యత్నం చేస్తోంది. ఇన్ఫెక్టడ్ లింక్ ఫైల్ ద్వారా విస్తరిస్తోంది. కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఈ ప్రక్రియ అంతా జరుగుతోంది. ఏదిఏమైనప్పటికీ ఇదీ విషయం అని కూడా రీసెర్చర్లు చెప్పలేకపోతున్నారు.