ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఆత్మ విశ్వాసం విజయానికి దోహదం

ABN, First Publish Date - 2022-11-02T23:46:48+05:30

ఆత్మస్థైర్యం, దృఢ సంకల్పం, క్రమశిక్షణతో ముందుకు సాగితే ఏ రంగంలోనైనా గెలుపుసాధించొచ్చని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. యువత చదువు, క్రీడల్లో రాణించి గుర్తింపు పొందాలన్నారు.

క్రికెట్‌ కిట్‌ అందజేస్తున్న గోలి శ్రీనివా్‌సరెడ్డి, నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కడ్తాల్‌, నవంబరు 2: ఆత్మస్థైర్యం, దృఢ సంకల్పం, క్రమశిక్షణతో ముందుకు సాగితే ఏ రంగంలోనైనా గెలుపుసాధించొచ్చని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. యువత చదువు, క్రీడల్లో రాణించి గుర్తింపు పొందాలన్నారు. బోయిన్‌గుట్ట తండాకు చెందిన నేనావత్‌ విజయ్‌కుమార్‌ జిల్లా స్థాయి క్రికెట్‌ టీంకు ఎంపికయ్యాడు. బుధవారం కడ్తాలలో అతడికి అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ వెంకటేశ్‌, రైతు సమితి జిల్లా సభ్యుడు బాచిరెడ్డి శ్రీనివా్‌సరెడ్డిలతో కలిసి విజ య్‌ని శ్రీనివా్‌సరెడ్డి సత్కరించారు. యువజన సంఘాల నాయకులకు గోలి క్రికెట్‌కిట్లను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. విశ్వాసంతో ముందుకు సాగేవారు లక్ష్యాన్ని అధిగమిస్తారన్నారు. ప్రతిభతోనే గౌరవం, గుర్తింపు లభిస్తాయన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. గ్రామీణ క్రీడాకారులకు ఉచిత శిక్షణ ఇచ్చిన ప్రోత్సహించే ందుకు ప్రభుత్వం గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిందని శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లచ్చిరామ్‌నాయక్‌, ముద్విన్‌ సర్పంచ్‌ యాదయ్య, నాయకులు సుమన్‌నాయక్‌, అంజినాయక్‌, మహేశ్‌, వినోద్‌ నాయక్‌, రాజు, కంబాలపల్లి అంజి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-02T23:46:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!