ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Mother’s Day: #MummyYaar Campaignను ప్రారంభించిన ‘కూ’

ABN, First Publish Date - 2022-05-08T21:42:12+05:30

మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ మైక్రో బ్లాగింగ్, సోషల్ మీడియా సైట్ ‘కూ’ (Koo) హ్యాష్‌ట్యాగ్ ‘మమ్మీయార్

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

బెంగళూరు: మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ మైక్రో బ్లాగింగ్, సోషల్ మీడియా సైట్ ‘కూ’ (Koo) హ్యాష్‌ట్యాగ్ ‘మమ్మీయార్ (#MummyYaar) ప్రచారాన్ని ప్రారంభించింది. మదర్స్ డే సందర్భంగా తల్లులకు తమ కృతజ్ఞతలను తెలియజేసేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుందని ‘కూ’ పేర్కొంది. ఈ డిజిటల్ యుగంలో నచ్చిన భాషలో భావాలను వ్యక్తీకరించేందుకు తోడ్పడుతుందని వివరించింది.


నోస్టాల్జిక్ వీడియోతోపాటు తమ తల్లల సోషల్ మీడియా ప్రయాణాల అనుభూతులను పంచుకునేందుకు యూజర్లను ఆహ్వానించే ఓ ఆకర్షణీయమైన పోటీని కూడా ప్రకటించింది. ఇది వారిని ‘మమ్మీయార్’ అని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. యూజర్లు తమ మమ్మీయార్ క్షణాలను మీమ్స్, వీడియోలు, పోస్టుల ద్వారా పంచుకుంటున్నారు.


ప్రముఖ సెలబ్రిటీలు, ప్రభావశీలురు (Influencers) మమ్మీయార్ క్షణాలను ఉత్సాహంగా షేర్ చేస్తున్నారు. హ్యాష్‌ట్యాగ్ మమ్మీయార్ క్యాంపెయిన్ రేపటి (సోమవారం) వరకు జరగనుంది. విజేతలు అద్భుతమైన బహుమతులు అందుకోనున్నారు. ఈ సందర్భంగా ‘కూ’ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. తమ అపారమైన ప్రేమను తల్లులకు తెలియజేయడమే మదర్స్ డే అని అన్నారు. తల్లుల విషయంలో సోషల్ మీడియా (Social Media) ఎప్పుడూ స్నేహపూర్వకంగా వ్యవహరించలేదని తాము భావిస్తున్నట్టు చెప్పారు.


అయితే, సురక్షితమైన, యూజర్ ఫస్ట్ ఫ్లాట్‌ఫామ్ అయిన కూ తమకు నచ్చిన భాషలో, నచ్చిన అంశంపై తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించేందుకు వీలు కల్పిస్తోందన్నారు. మమ్మీయార్ ద్వారా మాతృత్వ స్పూర్తికి వందనం చేయాలని తాము భావించినట్టు చెప్పారు. ఈ ప్రచారం ద్వారా నిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటూ, సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ, ప్రజా ప్రయోజనాల కోసం సాంకేతికలను ఉపయోగించుకునేలా తమ చుట్టూ ఉన్న వారిని ప్రేరేపించే తల్లులందరికీ తాము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా తల్లులు, కాబోయే తల్లులకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నట్టు చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!