ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

సమ్మర్‌ స్పెషల్‌ గాడ్జెట్స్‌ కూలింగ్‌ ఇలా

ABN, First Publish Date - 2022-05-07T05:30:00+05:30

వేసవి ప్రతాపం మనుషులకే కాదు. చెట్టు నీడకో, ఏసీ గదుల్లోకో చేరితే మనిషికి తాపం తగ్గవచ్చు. అయితే మనం నిత్యం ఉపయోగించే వివిధ గాడ్జెట్ల సంగతేమిటి అన్నది ప్రశ్నార్థకం. కింద ఇచ్చిన జాగ్రత్తలతో వీటి తాపమూ తగ్గించవచ్చు...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

వేసవి ప్రతాపం మనుషులకే కాదు. చెట్టు నీడకో, ఏసీ గదుల్లోకో చేరితే మనిషికి తాపం తగ్గవచ్చు. అయితే మనం నిత్యం ఉపయోగించే వివిధ గాడ్జెట్ల సంగతేమిటి అన్నది ప్రశ్నార్థకం. కింద ఇచ్చిన జాగ్రత్తలతో వీటి తాపమూ తగ్గించవచ్చు.


  1. సూర్య కిరణాలు నేరుగా గాడ్జెట్లపై పడేలా వాటిని పెట్టవద్దు. అతి వేడిమితో ఒక్కోసారి గాడ్జెట్‌లోని పరికరాలూ దెబ్బతినవచ్చు.
  2. వాతావరణం వేడిగా ముఖ్యంగా గాలిలో తేమ తక్కువగా ఉన్నచోట స్మార్ట్‌ ఫోన్‌ని పాకెట్‌లో పెట్టుకోవద్దు. ఆఫీసు లేదంటే ఇంటిదగ్గర డెస్క్‌ టేబుల్‌పై దానిని ఉంచడం ఉత్తమం. 
  3. గాడ్జెట్లను బైట వాతావరణంలో చార్జింగ్‌కు పెట్టకూడదు. బైటి వాతావరణంలో ఉన్న వేడి కూడా కలిసి ఓవర్‌ హీటింగ్‌కు దారి తీసే అవకాశం ఉంది. 
  4. కారు లోపల ఫోన్‌ పెట్టుకోవడం అంత మంచి పని కాదు. వేసవి కాలంలో మరీ ముఖ్యంగా ఔట్‌డోర్‌లో కారును ఉంచినప్పుడు అది గ్రీన్‌హౌ్‌సగా మారుతుంది. అలాంటప్పుడు గాడ్జెట్‌ కాస్తా కారు లోపల ఉంటే అది అతి వేడిమికి గురవుతుంది. అందువల్ల అవకాశం ఉన్నప్పటికీ ఎన్నడూ గాడ్జెట్‌ను కారు లోపల ఉంచకూడదు. 
  5. తలగడ, కుషన్‌, బ్లాంకెట్‌ కింద గాడ్జెట్‌ను ఉంచి చార్జింగ్‌ పెట్టకూడదు. అవన్నీ హీట్‌ను సంగ్రహిస్తాయి. ఫలితంగా గాడ్జెట్‌ సైతం విపరీతమైన వేడెక్కుతుంది. 
  6. ఓవర్‌ చార్జింగ్‌ అస్సలు చేయకూడని పని. దాంతో బ్యాటరీ కూడా దెబ్బతింటుంది. 
  7. ఎయిర్‌ కండిషనింగ్‌ వాతావరణంలో గాడ్జెట్లను ఉంచడం చాలా మంచిది. లేదంటే కూల్‌, క్లీన్‌, షేడ్‌ ఉన్న ప్లేస్‌లో ఉంచండి. బైటి గాలి నుంచి దుమ్ము తదితరాలను నేరుగా సంగ్రహించడానికి వీలుపడదు. 
  8. ల్యాప్‌టాప్‌ కూలింగ్‌ స్టాండ్‌ కొనుగోలు ఒక మంచి ఇన్వె్‌స్టమెంట్‌ అని చెప్పకతప్పదు. అతి పెద్ద అప్లికేషన్స్‌ లేదంటే వీడియో గేమ్స్‌ అడుతున్నప్పుడు బాగా ఉపయోగపడుతుంది. నిలుచోబెట్టే స్టాండ్‌ కలిగిన ఫ్యాన్లు పరికరాలు కూల్‌ అయ్యేందుకు ఉపయోగపడతాయి. ఇక్కడ గాలి కింది నుంచి పైకి వెళుతుంది. అదే సౌలభ్యం. ల్యాప్‌టాప్‌ కూలింగ్‌ స్టాండ్‌ వాస్తవానికి యూఎ్‌సబీ చార్జింగ్‌ కేబుల్‌తో కలిసి వస్తుంది. దాన్ని ఎక్స్‌టర్నల్‌ పవర్‌ సప్లయికి ప్లగ్‌ చేయాలి. ల్యాప్‌టా్‌పనకు నేరుగా వద్దు. అలా మేనేజ్‌ చేయగలిగితే బ్యాటరీ సేవ్‌ అవుతుంది. 
  9. గాడ్జెట్‌ను ఫ్రీజర్‌లో పెట్టడం అంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే. కండెన్స్‌డ్‌ ఎయిర్‌ డివైస్‌ లోపలకు వెళ్ళి విడిభాగాలను దెబ్బతీస్తుంది. 
  10. సెల్‌తో పనిలేనప్పుడు మొబైల్‌ డేటా, వైఫై, జీపీఎస్‌, వంటి వాటిని డిజేబుల్‌ చేసుకుంటే అధిక వేడిమి నుంచి కాపాడుకోవచ్చు.
  11. చాలా వరకు స్మార్ట్‌ ఫోన్లలో ఆప్టిమైజేషన్‌ ఫీచర్లు ఉంటాయి. అవి ఏ ఫీచర్లు బ్యాటరీని తినేస్తేన్నాయో చెబుతాయి. ఓవర్‌ హీటింగ్‌కు దారితీసే వాటిని తద్వారా తెలుసుకుని తగ్గించుకుంటే సెల్‌ లైఫ్‌ని పెంచుకోవచ్చు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!