ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

IPL: గ్రీన్ జెర్సీ ధరించిన RCB.. ఎందుకో తెలుసా?

ABN, First Publish Date - 2022-05-08T23:23:37+05:30

సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ముంబై: సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) గ్రీన్ జెర్సీ ధరించి బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కాగా, గో గ్రీన్ (Go Green) ఇనిషియేటివ్‌లో భాగంగానే ఆర్సీబీ గ్రీన్ జెర్సీ ధరించింది. నిజానికి ఆర్సీబీకి ఇదేమీ కొత్త కాదు. 2011 నుంచి ఇలా గ్రీన్ జెర్సీని ధరిస్తోంది. భవిష్యత్ తరాలకు  పరిశుభ్రమైన, పచ్చని వాతావారణం ఆవశ్యకతపై అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. 


2011లో కొత్త జట్టు అయిన కొచ్చి టస్కర్స్ కేరళతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ తొలిసారి గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగింది. ఆ మ్యాచ్‌లో 126 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన బెంగళూరు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తిలక్‌ర్నే దిల్షాన్ 52 పరుగులతో నాటౌట్‌గా నిలవగా క్రిస్ గేల్ 16 బంతుల్లో 44 పరుగులు చేశాడు. చివరిసారి 2020లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ గ్రీన్ జెర్సీ ధరించింది. ఆ మ్యాచ్‌లో ధోనీ సేన చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.  

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!