IPL 2022: నేను చూసినంత వరకు అదే బెస్ట్ బ్యాటింగ్: Rishabh Pant
ABN , First Publish Date - 2022-05-06T21:38:00+05:30 IST
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో Delhi Capitals ఓపెనర్ డేవిడ్ వార్నర్ వీరవిహారం చేశాడు. 58 బంతుల్లో

ముంబై: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో Delhi Capitals ఓపెనర్ డేవిడ్ వార్నర్ వీరవిహారం చేశాడు. 58 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో 92 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. David Warner బ్యాటింగ్‌పై ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు బ్యాటింగ్ చేసిన తీరు, ఇన్నింగ్స్‌ను నడిపించిన విధానాన్ని ఢిల్లీ క్యాంపులో ఇప్పటి వరకు తాను చూడలేదన్నాడు. అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో అదొకటని ఆకాశానికెత్తేశాడు.
అలాగే, 35 బంతుల్లో 3 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 67 పరుగులు చేసిన Rovman Pawellనూ పంత్ కొనియాడాడు. పావెల్ జట్టు కోసం ఏమివ్వగలడో తమకు తెలుసని అన్నాడు. తాము అతడికి అండగా నిలిచామని, అతడు అద్భుత బ్యాటింగుతో మెరిశాడని ప్రశంసించాడు. కీలక సమయంలో లభించిన ముఖ్యమైన విజయం ఇదని అన్నాడు. వార్నర్ మాట్లాడుతూ.. తన మాజీ ఫ్రాంచైజీకి వ్యతిరేకంగా ఆడుతున్నప్పుడు తనకు అదనపు ప్రేరణ ఏమీ అవసరం లేదని చెప్పుకొచ్చాడు.