ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Umran Malik ఖాతాలో మరో రికార్డు.. అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన SRH బౌలర్

ABN, First Publish Date - 2022-05-06T23:51:48+05:30

సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. గురువారం ఢిల్లీ కేపిటల్స్‌తో

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ముంబై: సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. గురువారం ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో Umran Malik  అత్యంత వేగంగా బంతిని సంధించి రికార్డు సృష్టించాడు. ఇప్పటికే అత్యంత వేగంగా బంతులు సంధిస్తూ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మాలిక్.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ చివరి బంతిని ఏకంగా 157 కిలోమీటర్ల వేగంతో సంధించాడు. ఐపీఎల్‌లో ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన డెలివరీ ఇదే. ఈ బంతిని ఎదుర్కొన్న Rovman Powell దానిని బౌండరీకి తరలించాడు. 


కాగా, ఉమ్రాన్ మాలిక్ ఇటీవల 156 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు.  ఇప్పుడు మరింత వేగంగా బంతిని విసిర తన రికార్డును తానే బద్దలుగొట్టాడు. ఇక, ఓవరాల్‌గా చూసుకుంటే ఆసీస్ పేసర్ షాన్ టెయిన్ పేరిట అత్యంత వేగవంతమైన డెలివరీ రికార్డు ఉంది. షాన్ టెయిన్ 157.3 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. ఈ జాబితాలో అతడు అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు ఉమ్రాన్ రెండో స్థానంలో నిలిచాడు. టీమిండియా మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ 1997లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 157 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. ఇప్పుడు ఉమ్రాన్ అంతే వేగంతో బంతిని విసిరి అతడి సరసన చేరాడు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!