ఐపీఎల్‌కు దూరమైన కమిన్స్‌

ABN , First Publish Date - 2022-05-14T10:02:44+05:30 IST

ప్లేఆ్‌ఫ్సపై ఆశలు పెట్టుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ తుంటి గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

ఐపీఎల్‌కు  దూరమైన కమిన్స్‌

ముంబై: ప్లేఆఫ్స్‌పై ఆశలు పెట్టుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ తుంటి గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. శనివారం హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో కేకేఆర్‌ కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఓడితే రేసు నుంచి నిష్క్రమించే ప్రమాదమున్న వేళ కమిన్స్‌  వైదొలగడం జట్టుకు లోటే. కమిన్స్‌ ఇప్పటిదాకా ఐదు మ్యాచ్‌లాడి, ఏడు వికెట్లతో పాటు 63 పరుగులు చేశాడు.


Read more