ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

IPL2022: టాస్ గెలిచిన సీఎస్కే.. మ్యాచ్‌లో గెలుపు ఎవరిది.. ప్రివ్యూ...

ABN, First Publish Date - 2022-05-05T00:42:33+05:30

పుణె: Ipl2022లో మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేచింది. Royal Challengers Bangalore - Chennai Super Kings మ్యాచ్‌లో టాస్ గెలిచిన CSK కెప్టెన్ మహీంద్రా సింగ్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పుణె: Ipl2022లో మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేచింది. Royal Challengers Bangalore - Chennai Super Kings మ్యాచ్‌లో టాస్ గెలిచిన CSK కెప్టెన్ మహీంద్రా సింగ్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు.

జట్లు ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ, డుప్లెసిస్(కెప్టెన్), రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్, మహిపాల్ లొమ్రోర్, షాబాజ్ అహ్మద్, వణిందు హసరంగ, హర్షల్ పటేల్, హేజెల్‌వుడ్, మొహమ్మద్ సిరాజ్.

సీఎస్‌కే : రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, దేవోన్ కాన్వే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, సిమర్జీత్ సింగ్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(కెప్టెన్), సిమర్జీత్ సింగ్, ప్రిటోరియస్, మహీష్ తీక్షణ్, ముకేష్ చౌదరి.


మ్యాచ్ ప్రివ్యూ..

 Royal Challengers Bangalore - Chennai Super Kings ఈ ఏడాది  IPL2022లో రెండవసారి  తలపడుతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 6వ స్థానంలో ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ 9వ స్థానంలో ఉంది. సీజన్ ఆరంభంలో ఆకట్టుకున్న ఆర్సీబీ గత 3 మ్యాచుల్లోనూ వరుస ఓటములను చవిచూసింది. కాబట్టి పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరచుకునేందుకు ఈ మ్యాచ్ ఎంతో కీలకమైనది. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలవాలని జట్టు భావిస్తోంది. ఐపీఎల్ 2022లో ఆర్సీబీ మొత్తం 10 మ్యాచులు ఆడి 5 విజయాలు నమోదు చేసింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ 9 మ్యాచులు ఆడి మూడింట్లో గెలిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చివరిగా గుజరాత్ టైటాన్స్‌పై ఆడి 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. విరాట్ కోహ్లీ 58, రజత్ పటీదార్ 52 పరుగులు చేసినా గెట్టును గెలిపించుకోలేకపోయారు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ విజయాల బాట పట్టింది. కెప్టెన్సీ పగ్గాలు ధోనికి అప్పగించాక సీఎస్కే ఊపమీద ఉన్నట్టు కనిపిస్తోంది. చివరిగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆడి 13 పరుగుల తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రుతురాజ్ గైక్వాడ్ 99 , దెవొన్ కాన్వే 85 పరుగులతో భారీ స్కోర్లు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. బౌలింగ్ విషయానికి వస్తే ముకేష్ చౌదరీ 4 వికెట్లు తీసి హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు. కాగా చివరిసారిగా చెన్నై సూపర్ కింగ్స్ - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడ్డప్పుడు సీఎస్కే గెలుపొందింది. 23 పరుగుల తేడాతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 


గెలుపు ఎవరిని వరిస్తుందో..

జట్టు బలాబలాలు సమతూకంగా ఉండడంతో విజయం ఎవరిని వరిస్తుందో అంచనా వేయడం అంత సులభం కాదు. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల ఆటగాళ్లు ఇరు జట్లలోనూ ఉన్నారు. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే.. ఎంసీఏ స్టేడియం పుణె పిచ్ వికెట్ ఆరంభంలో బ్యాట్స్‌మెన్లకు సహకరిస్తుంది. అయితే మ్యాచ్ గడుస్తున్న కొద్ది స్పిన్నర్లకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. లక్ష్య చేధనకు దిగే జట్టుకు ఈ వికెట్‌పై సానుకూలత  ఉంటుంది. అయితే రెండోసారి బ్యాటింగ్‌కు దిగిన జట్లకు ఇక్కడి రికార్డులు అంత ఫేవర్‌గా లేదు. ఈ ట్రాక్‌పై చేజింగ్ టీం గెలుపు అవకాశాలు 40 శాతంగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.  ఈ స్టేడియంలో ఫస్ట్ ఇన్నింగ్స్ సగటు స్కోరు 174 పరుగులుగా ఉంది. ఇక బౌండరీ డిస్టెన్స్ 80 -85 మీటర్ల మధ్య ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!