ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

IPL: బెంబేలెత్తించిన బుమ్రా.. ఓ మోస్తరు స్కోరు చేసిన KKR

ABN, First Publish Date - 2022-05-10T03:06:29+05:30

ముంబై ఇండియన్స్ బౌలర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కోల్‌కతా బ్యాటర్లను బెంబేలెత్తించాడు. నిప్పులు చెరిగే బంతులు విసురుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ముంబై: ముంబై ఇండియన్స్ బౌలర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కోల్‌కతా బ్యాటర్లను బెంబేలెత్తించాడు. నిప్పులు చెరిగే బంతులు విసురుతూ చెలరేగిపోయాడు. అతడి బౌలింగులో పరుగుల సంగతి దేవుడెరుగు, వికెట్లను కాపాడుకుంటే చాలు అన్నట్టుగా కేకేఆర్ బ్యాటర్లు బ్యాట్లు అడ్డం పెట్టారు. నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా పది పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు నేలకూల్చాడు. ఫలితంగా శ్రేయాస్ అయ్యర్ సేన 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగుల ఓ మోస్తరు స్కోరు చేసింది.


తొలుత ఆండ్రూ రసెల్‌ (9)ని పెవిలియన్ పంపిన బుమ్రా.. ఆ తర్వాత దాటిగా ఆడుతున్న నితీశ్ రాణా (26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43)ను ఔట్ చేశాడు. దీంతో అప్పటి వరకు భారీ స్కోరు దిశగా పయనిస్తున్న కేకేఆర్ ఒక్కసారిగా ఒత్తిడికిలోనైంది. పరుగులు వేగం మందగించింది. మరోవైపు, రెండు వికెట్లు తీసిన ఊపులో ఉన్న బుమ్రా బంతికి మరింత పదునుపెట్టాడు.


షెల్డన్ జాక్సన్(6), పాట్ కమిన్స్ (0), సునీల్ నరైన్ (0)లను ఒకే ఓవర్‌లో ఔట్ చేశాడు. ఫలితంగా అతడి ఖాతాలో ఐదు వికెట్లు చేరాయి. కుమార్ కార్తికేయకు రెండు వికెట్లు దక్కాయి. ఇక, కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా రాణించారు. వెంకటేశ్ అయ్యర్ 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేయగా, రాణా కూడా 43 పరుగులే చేశాడు. రహానే (25), రింకు సింగ్ (23, నాటౌట్) పరవాలేదనిపించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!