ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఐపీఎల్‌లో Arjun Tendulkar అరంగేట్రం ఇంకెంత దూరం?

ABN, First Publish Date - 2022-05-06T02:32:36+05:30

టీమిండియా మాజీ క్రికెటర్ Sachin Tendulkar కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రానికి

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్ Sachin Tendulkar కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రానికి ఇంకా సమయం ఉందా? ప్రస్తుతం ముంబై ఇండియన్స్ పరిస్థితి చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అర్జున్ టెండూల్కర్‌‌ను గతేడాది కూడా Mumbai Indians అతడి బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. ఈసారి కూడా రూ. 30 లక్షలకు కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటి వరకు మైదానంలోకి దిగలేదు. దీంతో తొలి మ్యాచ్ కోసం అర్జున్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. అయితే, ఈసారి కూడా అతడికి నిరాశ తప్పకపోవచ్చు.


ముంబై ఇండియన్స్ ఈసారి పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. వరుసగా 8 మ్యాచుల్లో ఓడిన ఆ జట్టు ఎట్టకేలకు 9వ మ్యాచ్‌లో విజయం సాధించి ఖాతా తెరిచింది. ఈ నేపథ్యంలో కొత్తవారికి అవకాశం ఇవ్వడం అంత కరెక్ట్ కాదని భావిస్తున్న ముంబై రిజర్వు ఆటగాళ్లను బెంచ్‌కే పరిమితం చేయాలని భావిస్తోంది.


ఈ నేపథ్యంలో అర్జున్ టెండూల్కర్ IPL ఎంట్రీపై ఆ జట్టు కోచ్ మహేల జయవర్ధనె స్పందించాడు. అవకాశాలు రావని ఎవరూ అనుకోవద్దని, ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుందనే అనుకుంటున్నామని అన్నాడు. అయితే, అవకాశం అనేది ఆటగాళ్ల కాంబినేషన్లు, జట్టు ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చాడు.


ప్రతి మ్యాచ్ తమకు ముఖ్యమేనన్న Mahela Jayawardene.. అత్యుత్తమ ఆటగాళ్లను బరిలోకి దింపడం ఎంతో కీలకమని అభిప్రాయపడ్డాడు. ఆ లిస్టులో అర్జున్ పేరు కూడా ఉంటే తుది జట్టులో తప్పకుండా అతడి పేరు ఉంటుందని మహేల వివరించాడు. అయితే, అతడి మాటలను ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడాలన్న అర్జున్ కల నెరవేరడం ఈసారి కూడా కష్టమేనని అర్థమవుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!