IPL: లక్నోపై టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్
ABN , First Publish Date - 2022-05-08T00:43:01+05:30 IST
ఐపీఎల్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)తో జరగున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్
పూణె: ఐపీఎల్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)తో జరగున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న లక్నో ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్‌లో చోటు ఖాయమైనట్టే. ప్రారంభంలో అద్భుతంగా రాణించిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆ తర్వాత చతికిలపడింది.
వరుస పరాజయాలతో కింది నుంచి మూడో స్థానానికి పడిపోయింది. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా ఖాతాలో 8 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ప్లే ఆఫ్స్ ఆశలు నిలుపుకోవాలంటే ఆ జట్టు ఇక నుంచి ప్రతీ మ్యాచ్‌లోనూ గెలవాల్సి ఉంటుంది.