IPL 2022: రాజస్థాన్‌ను 152 పరుగులకు కట్టడి చేసిన KKR
ABN , First Publish Date - 2022-05-03T02:56:35+05:30 IST
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో Rajasthan Royals నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల

ముంబై: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో Rajasthan Royals నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్ సంజు శాంసన్ 49 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో అర్ధ సెంచరీ (54) రాణించాడు.
జోస్ బట్లర్ 22, దేవదత్ పడిక్కల్ 2, కరుణ్ నాయర్ 13, రియాన్ పరాగ్ 19 పరుగులు చేశారు. షిమ్రన్ హెట్మెయిర్ 27, రవిచంద్రన్ అశ్విన్ 6 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. KKR బౌలర్లలో టిమ్ సౌథీ రెండు వికెట్లు తీసుకోగా, ఉమేశ్ యాదవ్, అనుకుల్ రాయ్, శివమ్ మావి తలా ఓ వికెట్ తీసుకున్నారు.