ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

తొలిసారి ఫైనల్‌కు..

ABN, First Publish Date - 2022-05-14T09:59:58+05:30

థామస్‌ కప్‌లో భారత షట్లర్ల అద్వితీయ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లోనూ భారత జట్టు సంచలన ఆటతీరుతో డెన్మార్క్‌ను 3-2తో చిత్తు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

 థామస్‌ కప్‌లో భారత్‌ జోరు

3-2తో డెన్మార్క్‌పై విజయం

ఇండోనేసియాతో అమీతుమీ

బ్యాంకాక్‌: థామస్‌ కప్‌లో భారత షట్లర్ల అద్వితీయ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లోనూ భారత జట్టు సంచలన ఆటతీరుతో డెన్మార్క్‌ను 3-2తో చిత్తు చేసింది. తద్వారా తొలిసారిగా ఫైనల్లో అడుగుపెట్టి కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకుంది. ఈసారి కూడా హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ మ్యాచ్‌ అత్యంత కీలకంగా మారింది. ఈనేపథ్యంలో అతడు ఒత్తిడిని జయిస్తూ 13-21, 21-9, 21-12 తేడాతో రాస్మస్‌ గెంకేను ఓడించి భారత్‌ను స్వర్ణ పోరుకు అర్హత సాధించేలా చేశాడు. తొలి గేమ్‌లో మోకాలి నొప్పికి గురైన ప్రణయ్‌ పెయిన్‌ కిల్లర్స్‌ తీసుకునే చెలరేగడం విశేషం. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌, 14 సార్లు విజేత ఇండోనేసియాతో భారత్‌ తలపడనుంది. కాగా సెమీస్‌ లో ఇండోనేసియా 3-2తో జపాన్‌ను ఓడించింది.


ప్రణయ్‌ ఫినిషింగ్‌:

క్వార్టర్స్‌ మాదిరే సెమీస్‌ పోరును కూడా భారత్‌ ఓటమితోనే ఆరంభించింది. తొలి సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ 13-21, 13-21 తేడాతో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ విక్టర్‌ అక్సెల్‌సెన్‌ చేతిలో చిత్తయ్యాడు. 21 నిమిషాల్లోనే ముగిసిన తొలి గేమ్‌ ప్రారంభంలో 8-8తో  పోటాపోటీగా సాగినా ఆ తర్వాత విక్టర్‌ ధాటి ముందు సేన్‌ నిలువలేకపోయాడు. ఇక రెండో గేమ్‌లో 4-11తో వెనుకబడిన సేన్‌ తర్వాత కోలుకోలేదు. ఆ తర్వాత ఉత్కంఠభరితంగా సాగిన డబుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ 21-18, 21-23, 22-20 తేడాతో కిమ్‌-మథియా్‌సపై గెలిచి భారత్‌ను పోటీలో నిలబెట్టారు. రెండో గేమ్‌లో 20-18తో ఆధిక్యంలో ఉన్న వేళ భారత జోడీ రెండు మ్యాచ్‌ పాయింట్లను చేజార్చుకుంది.


నిర్ణాయక గేమ్‌లో మాత్రం పట్టుదలగా ఆడి 15-13తో ఆధిక్యంలోకి వెళ్లాక ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. అయితే ఆఖర్లో మూడు మ్యాచ్‌ పాయింట్లను కోల్పోవడంతో ఉత్కంఠ పెరిగింది. కానీ ఈసారి ఒత్తిడిని అధిగమిస్తూ 22-20తో మ్యాచ్‌ను ముగించారు. ఆ తర్వాత సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ 21-18, 12-21, 21-15తో ప్రపంచ మూడో ర్యాంకర్‌ ఆంటోన్‌సెన్‌పై విజయం సాధించడంతో భారత్‌ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ మరో డబుల్స్‌ జోడీ క్రిష్ణ ప్రసాద్‌- విష్ణువర్థన్‌ 14-21, 13-21 తేడాతో వరుస గేమ్‌ల్లో రస్ముసెన్‌-సోగార్డ్‌ చేతిలో ఓడారు. ఈ ఫలితంతో ఓవరాల్‌ స్కోరు 2-2తో సమమైంది. దీంతో హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ సింగిల్స్‌ మ్యాచ్‌పైనే అందరి దృష్టీ నెలకొంది. తొలి గేమ్‌ను 13-21 తేడాతో ఓడినప్పటికీ రెండో గేమ్‌లో మాత్రం విజృంభించాడు. పదునైన స్మాష్‌లతో 21-9తో ముగిస్తూ.. మ్యాచ్‌ను మూడో గేమ్‌కు తీసుకెళ్లాడు. ఇక్కడ కూడా ఆరంభం నుంచే ఆధిక్యం కోల్పోకుండా దూకుడును కొనసాగించి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!