పెళ్లి జరుగుతుండగా సడెన్ ఎంట్రీ.. వరుడి చేతిలోని దండ లాక్కుని వధువు మెడలో వేసి.. చివరకు..

ABN , First Publish Date - 2022-05-05T20:49:40+05:30 IST

అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతోంది.. వరుడు, వధువు పెళ్లి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు..

పెళ్లి జరుగుతుండగా సడెన్ ఎంట్రీ.. వరుడి చేతిలోని దండ లాక్కుని వధువు మెడలో వేసి.. చివరకు..

అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతోంది.. వరుడు, వధువు పెళ్లి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు.. దండలు మార్చుకునే సమయం ఆసన్నమైంది.. ఆ సమయంలో హఠాత్తుగా ఆ వధువు ప్రియుడు వేదిక ఎక్కాడు.. వరుడి చేతిలోని దండ లాక్కుని వధువు మెడలో వేశాడు.. నుదుటిన సింధూరం దిద్దాడు.. దీంతో పెళ్లికి వెళ్లిన బంధుమిత్రులు ఆ యువకుడిని చితక్కొట్టారు.. అతడిని రక్షించేందుకు వధువు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.. తీవ్రగాయాల పాలైన అతడిని పోలీసులకు అప్పగించారు.


బీహార్‌లోని పాట్నాలో ఎరాయ్ గ్రామంలో సోమవారం అర్థరాత్రి ఓ వివాహం జరుగుతోంది. వధువు, వరుడు పెళ్లి తంతు పూర్తి చేసి ఒకరి మెడలో మరొకరు దండలు వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆ సమయంలో అమిత్ కుమార్ అనే యువకుడు హఠాత్తుగా పెళ్లి వేదిక ఎక్కాడు. వరుడి చేతిలోని దండ తీసుకుని వధువు మెడలో వేశాడు. సింధూరం తీసుకుని వధువు నుదిటిపై అద్దాడు. ఆ ఘటన చూసి పెళ్లి వేడుకకు హాజరైన వారు దిగ్భ్రాంతికి గురయారు. వెంటనే తేరుకుని అమిత్‌ను చితక్కొట్టారు. 


కొద్దిసేపటి తర్వాత అమిత్.. వధువు ప్రియుడని తెలిసింది. తన ప్రియుడిని దెబ్బల నుంచి కాపాడేందుకు వధువు ప్రయత్నించింది. అయినా బంధువులు ఆ యువకుడిని తీవ్రంగా కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కాగా, వధువుకు లవ్ అఫైర్ ఉందని తెలుసుకుని వరుడి కుటుంబ సభ్యులు పెళ్లి రద్దు చేసుకుని ఇంటికి వెళ్లిపోయారు. యువతి తరపు వారు యువకుడిపై ఎటువంటి ఫిర్యాదూ చేయకపోవడంతో పోలీసులు నిందితుడైన అమిత్ కుమార్‌ను విడుదల చేశారు.

Read more