ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మూడు నెలల తర్వాత సమాధి నుంచి మృతదేహం బయటకు.. అసలు విషయం ఏంటంటే..

ABN, First Publish Date - 2022-05-12T08:46:03+05:30

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మూడు నెలల తర్వాత ఓ మహిళ మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీశారు.. ఆ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు.. తమ కూతురి మరణం విషయంలో అనుమానాలున్నాయని తల్లిదండ్రులు...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మూడు నెలల తర్వాత ఓ మహిళ మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీశారు.. ఆ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు.. తమ కూతురి మరణం విషయంలో అనుమానాలున్నాయని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఈ రకమైన ఆదేశాలు ఇచ్చారు.. ఉత్తరప్రదేశ్‌లోని మొరేదాబాద్‌లో ఈ ఘటన జరిగింది. 


వివరాల్లోకి వెళితే.. మొరేదాబాద్‌కు సమీపంలోని భగత్‌పురాకు చెందిన లక్‌పత్ సింగ్ అనే వ్యక్తి తన కూతురిని బార్కేడా గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. మూడు నెలల కిందట ఆ యువతి చనిపోయింది. అత్తమామలు ఆ విషయం లక్‌పత్ సింగ్‌కు ఫోన్ చేసి చెప్పారు. లక్‌పత్ సింగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లేటప్పటికే అతని కూతురికి భర్త, అత్తమామలు కలిసి అంత్యక్రియలు పూర్తి చేసేశారు. ఆ సమయంలో ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. 


మూడు నెలల అనంతరం తమ కూతురి మృతిపై అనుమానాలున్నాయని లక్‌పత్ సింగ్ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించాడు. వరకట్నం వేధింపుల్లో భాగంగానే అల్లుడు, అతని తల్లిదండ్రులు తన కూతురిని చంపేశారని పేర్కొన్నాడు. దీంతో జిల్లా కలెక్టర్ లక్‌పత్ సింగ్ కూతురి మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టమ్ నిర్వహించాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!