ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాయంతో భగవద్గీత విశ్లేషణ.. శాస్త్రవేత్తల కొత్త అధ్యయనం..

ABN, First Publish Date - 2022-05-12T23:31:21+05:30

మతం, ఆధ్యాత్మితక వంటి సంక్లిష్టమైన అంశాల విశ్లేషణలో ఏఐ సామర్థ్యం ఎంత..? ముఖ్యంగా భగవద్గీత లాంటి గ్రంథంలోని భావాలూ, నిగూఢార్థాలను ఏఐ విశ్లేషించగలదా..? ఈ ప్రశ్నలకు సమాధానంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేథ(Artificial Intelligence, AI) మానవ సమాజంలో వేళ్లూనుకుపోయింది. శాస్త్రవేత్తలు.. అనేక సమస్యలకు ఏఐ(AI) సాయంతో పరిష్కారాలు కనుగొన్నారు కూడా..! ప్రస్తుతం ఏఐ ఆధారిత కెమెరాలు ఓ వ్యక్తిని అతడి ముఖకవళికల ఆధారంగా గుర్తించగలవు. వందల మంది మధ్య ఉన్న వారిని కూడా అత్యంత కచ్చితత్వంతో కనిపెట్టగలవు. ఇక ప్రోటీన్‌‌ తుది రూపు ఎలా ఉంటుందో కూడా ఏఐ సాయంతో తెలుసుకోవచ్చు. మరి మతం, ఆధ్యాత్మితక వంటి సంక్లిష్టమైన అంశాల విశ్లేషణలో ఏఐ సామర్థ్యం ఎంత..? ముఖ్యంగా భగవద్గీత లాంటి గ్రంథంలోని భావాలూ, నిగూఢార్థాలను ఏఐ విశ్లేషించగలదా..? 


ఈ ప్రశ్నలకు సమాధానంగా శాస్త్రవేత్తలు చేపట్టిన ఓ అధ్యయనం మంచి ఫలితాలను ఇచ్చింది. యూనివర్శిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్‌కు(ఆస్ట్రేలియా) చెందిన రోహితాష్ చంద్ర, ఇతర శాస్త్రవేత్తలు ఏఐ సాయంతో భగవద్గీత ఆంగ్ల అనువాదాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఏఐ.. అనువాదాల్లోని వాక్య నిర్మాణాన్ని విశ్లేషించి, వాటిల్లోని భావాలను గుర్తించడంలో చాలా వరకూ సఫలీకృతమైంది. ఇందుకోసం శాస్త్రవేత్తలు గూగుల్  రూపొందించిన బెర్ట్(BERT) అనే డీప్ లర్నింగ్ ఆధారిత లాంగ్వేజ్ మోడల్‌ను ఎంచుకున్నారు. బెర్ట్ సాయంతో భగవద్గీతకు సంబంధించి మూడు ఆంగ్ల అనువాదాల్ని విశ్లేషించారు. ఈ అనువాదాల్లో ఒకదాన్ని మహాత్మా గాంధీ రచించగా.. మిగతా రెండింటిని ఏకనాథ్ ఈశ్వరన్, పురోహిత్ స్వామి రాశారు. 



భగవద్గీత అనువాదాల్లో వాడిన పదాలు, వాక్యనిర్మాణం.. వేటికవే భిన్నంగా ఉన్నప్పటికీ, వాటి మధ్య సారూప్యతను ఏఐ చాలా వరకూ గుర్తించగలిగింది. ఆయా పంక్తుల్లో ఉన్న భావాలను అర్థం చేసుకోగలిగింది. భగవద్గీత మొదటి శ్లోకం నుంచి చివర వరకూ విశ్లేషించి.. భావాల్లో మార్పును పసిగట్టింది. అయితే.. ట్విటర్‌లో డాటా ఆధారంగా ఈ లాంగ్వేజ్ టూల్ అభివృద్ధి చెందడంతో.. భగవద్గీతలోని కొన్ని శ్లోకాల విషయంలో బెర్ట్ పొరపాటు పడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా.. కొన్ని భాగాలు హాస్యరసంతో కూడినవిగా గుర్తించి పొరపాటు పడిందని పేర్కొన్నారు. 



అయితే..  ఏఐ సాయంతో సంక్షిష్టమైన భాషా విశ్లేషణకు ఈ అధ్యయనం ఓ కొత్త మార్గాన్ని అందుబాటులోకి తెచ్చిందని శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. సినిమాలు, పాటల్లో వాడిన పదాలు, వాక్యాలు, వాటిల్లో వ్యక్తమైన భావాలను ఏఐతో విశ్లేషించవచ్చన్నారు. తద్వారా... కాపీరైట్ సంబంధిత విషయాల్లో ఈ టూల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.  అంతేకాకుండా..చిన్నారులకు అనువైన చిత్రాలు, పాటలను ఎంపిక చేయడంలో తల్లిదండ్రులకు ఇది ఎంతో సాయపడుతుందని పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!