Viral Video: రెండు భారీ కొండచిలువలను భుజాలపై పెట్టుకుని డ్యాన్స్.. షాకవుతున్న నెటిజన్లు!
ABN , First Publish Date - 2022-05-02T22:06:15+05:30 IST
సాధారణంగా పాములంటే చాలా మంది భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా జంకుతారు. సాధారణంగా పాములంటే చాలా మంది భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా జంకుతారు.

సాధారణంగా పాములంటే చాలా మంది భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా జంకుతారు. అలాంటిది ఎవరైనా పాములతో కలిసి డ్యాన్స్ చేశారంటే కచ్చితంగా అది ఆసక్తికర విషయమే అవుతుంది. తాజాగా ఓ వ్యక్తి రెండు భారీ కొండచిలువలతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోను `వరల్డ్ ఆఫ్ స్నేక్స్` అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశారు.
ఆ రెండు కొండచిలువలు ప్రపంచంలోనే అతి పొడవైనవని సదరు ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పేర్కొన్నారు. ఆ రెండు కొండచిలువలను ఇండోనేసియాకు చెందిన ఓ వ్యక్తి భుజాలపై వేసుకుని బ్యాగ్రౌండ్‌లో వస్తున్న బీట్‌కు అనుగుణంగా డ్యాన్స్ వేశాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వెంటనే వైరల్ అయింది. ఇప్పటికి 44 వేలకు పైగా లైక్స్ దక్కించుకుంది. ఆ మనిషి ధైర్యానికి చాలా మంది నెటిజన్లు విస్తుపోతున్నారు.
Read more