-
-
Home » Prathyekam » UK Company is Offering Rs 1 Lakh to Eat at McDonalds prvn spl-MRGS-Prathyekam
-
నెలకు లక్షరూపాయల జీతంతో UK కంపెనీ జాబ్ ఆఫర్.. Restaurantsలో లభించే వాటిని తినడమే ఎంపికైన అభ్యర్థులు చేయాల్సిన పని!
ABN , First Publish Date - 2022-05-08T21:36:25+05:30 IST
ఓ కంపెనీ విడుదల చేసిన ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఇంతకూ ఆ కంపెనీ రిలీజ్ చేసిన ప్రకటన ఏంటి? నెటిజన్లు ఎందకు అంత ఆశ్చర్యపోతు

ఇంటర్నెట్ డెస్క్: ఓ కంపెనీ విడుదల చేసిన ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఇంతకూ ఆ కంపెనీ రిలీజ్ చేసిన ప్రకటన ఏంటి? నెటిజన్లు ఎందకు అంత ఆశ్చర్యపోతున్నారనే పూర్తి వెళితే..
యూకేకు చెందిన మెటీరియల్స్ మార్కెట్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘టేక్‌అవే టేస్టర్’ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరింది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 1000పౌండ్లు (సుమారు లక్షరూపాయలు) ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందులో విచిత్రం ఏముంది అని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్టు. అదేంటంటే.. ప్రముఖ మెక్‌డొనాల్డ్స్, సబ్‌వే వంటి ప్రముఖ రెస్టారెంట్‌లకు సంబంధించిన ఫుడ్‌ని టేస్ట్ చేయడమే జాబ్‌కు ఎంపికైన అభ్యర్థులు చేయాల్సిన పని. దీంతో ఆ ఫుడ్‌పై తమ అభిప్రాయం చెప్పాలి. ఫుడ్ తినడం వల్ల ఎవైనా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటే వాటిని కూడా వెల్లడించాలి. ఇక్కడ ఆసక్తికర మైన విషయం ఏంటంటే.. Takeaway Testerలు రెస్టారెంట్‌లలో చేసే భోజనానికి సంబంధించిన బిల్లులను కూడా కంపెనీనే భరిస్తుంది.