Onlineలో Video చూశాడు.. భవనంపై నుంచి దూకేశాడు..!
ABN, First Publish Date - 2022-05-05T21:58:56+05:30
ఆన్లైన్ గేమ్ చూసి ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. దావణెగెరె జిల్లాలో ఏప్రిల్ 23న ఈ ఘటన చోటు చేసుకుంది. ఆన్లైన్లో ఓ యానిమేషన్ గేమ్ చూసిన విద్యార్ధి.
ఇంటర్నెట్ డెస్క్: ఆన్లైన్ గేమ్ చూసి ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. దావణెగెరె జిల్లాలో ఏప్రిల్ 23న ఈ ఘటన చోటు చేసుకుంది. ఆన్లైన్లో ఓ యానిమేషన్ గేమ్ చూసిన విద్యార్ధి.. ఆ తర్వాత ఓ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. చనిపోయే ముందు ఆ బాలుడు గూగుల్‌లో ఓ ఆన్లైన్ గేమ్‌కు సంబంధించిన యానిమేషన్ వీడియోల గురించి సెర్చ్ చేశాడని నిర్ధారించారు. ఈ వీడియో చూసిన తర్వాతే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేయగా.. దర్యాప్తులో కీలక బయటికొచ్చాయి. చనిపోయే ముందుకు అతడు తన చెయ్యిని కూడా కోసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్లో.. తన చావుకు తానే కారణమని రాశాడని వివరించారు. అయితే, చేతిరాతను పోల్చి చూసేందుకు నోట్‌ను నిపుణులు వద్దకు పంపినట్లు పోలీసులు వెల్లడించారు.