ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

మహాసముద్రం అడుగు భాగంలో ‘Yellow Brick Road’.. గ్రంథాల్లో చెప్పినట్టు ఆ మహానగరం నిజంగానే నీట మునిగిందా!

ABN, First Publish Date - 2022-05-13T03:11:04+05:30

‘అట్లాంటిస్ నగరం’.. ప్రాచీన గ్రంథాల్లో తప్పితే ఇటువంటి ఒక నగరం ఉందనడానికి ఎక్కడా బలమైన ఆధారాలు లేవు. గ్రీకు తత్వవేత్త ప్లేటో ప్రస్తావించిన ఈ నగరం.. వేల ఏళ్ల క్రితం భారీ భూకంపం, సునామీ వ

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఇంటర్నెట్ డెస్క్: ‘అట్లాంటిస్ నగరం’.. ప్రాచీన గ్రంథాల్లో తప్పితే ఇటువంటి ఒక నగరం ఉందనడానికి ఎక్కడా బలమైన ఆధారాలు లేవు. గ్రీకు తత్వవేత్త ప్లేటో ప్రస్తావించిన ఈ నగరం.. వేల ఏళ్ల క్రితం భారీ భూకంపం, సునామీ వల్ల ఒక్కరాత్రిలోనే నీట మునిగిపోయిందని చాలా మంది నమ్ముతున్నారు. అయితే అటువంటి నగరమే లేదు అని కొట్టిపారేసేవారు సైతం ఉన్నారు. కాగా.. ఇపుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే.. కొందరు శాస్త్రవేత్తలు తాజాగా విడుదల చేసిన వీడియో నగరం ఉండేదనే వాదనను బలపరుస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుండగా.. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 



శాస్త్రవేత్తలు పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న పాపహనామోకుకేయా మెరైన్ నేషనల్ మాన్యుమెంట్ (Papahanaumokuakea Marine National Monument)‌లోని లిలియుకలని రిడ్జ్‌ను (Liliʻuokalani ridge) సర్వే చేస్తుండగా సముద్రం అడుగు భాగంలో వారికి పసుపు వర్ణంలో ఉన్న ఇటుకలతో కూడిన ఓ రోడ్డు కనిపించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను శాస్త్రవేత్తలు సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీంతో చాలా మంది ప్రాచీన గ్రంథాల్లో చెప్పిన ‘అట్లాంటిస్ నగరం (City of Atlantis)’ నిజంగానే ఒకప్పుడు భూమి మీద ఉందనడానికి ఆధారాలు లభించాయని అభిప్రాయపడుతున్నారు. అయితే శాస్రవేత్తలు మాత్రం.. ప్రాచీన కాలంలో అగ్నిపర్వాతాలు విస్పోటనం చెందినపుడు వెదజల్లిన లావా గడ్డ కట్టుకుపోయి ప్రస్తుతం అలా కనిపిస్తుందని అంటున్నారు. అంతేకాకుండా ఊహాజనిత నగరానికి సంబంధించిన రోడ్డు అనే వాదనను ఖండిస్తున్నారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!