చాణక్యనీతి: ఈ ముగ్గురికీ ఎప్పుడూ సహాయం చేయకండి.. లేదంటే సమస్యలు ముంచెత్తుతాయి!

ABN , First Publish Date - 2022-05-12T12:41:44+05:30 IST

ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో జీవితానికి...

చాణక్యనీతి: ఈ ముగ్గురికీ ఎప్పుడూ సహాయం చేయకండి.. లేదంటే సమస్యలు ముంచెత్తుతాయి!

ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో జీవితానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. మానవ జీవితాన్ని ప్రభావితం చేసే వివిధ విషయాలను చాణక్య చాలా లోతుగా అధ్యయనం చేశారు. చాణక్యుడు నేటికీ గొప్ప విద్యావేత్తగా, ఆర్థికవేత్తగా, దౌత్యవేత్తగా గుర్తింపు పొందుతున్నారు. ఆచార్య చాణక్యుని విధానాలను అనుసరించే వ్యక్తికి జీవితంలో అంతగా వైఫల్యాలు ఎదురుకావని చెబుతారు. చాణక్య తెలిపిన ప్రకారం జీవితంలో ఎవరికి సహాయం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

మూర్ఖుడికి సహాయం చేయవద్దు 

ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం మూర్ఖుడికి సహాయం చేయకూడదు. తెలివితక్కువ వ్యక్తికి జ్ఞానానికి సంబంధించిన విషయాలు చెప్పకూడదు. అలాంటి వారికి జ్ఞానాన్ని అందించడం గేదె ముందు వీణ వాయించినట్లేనని ఆచార్య తెలిపారు. బుద్ధిహీనునికి జ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా మేలు చేయాలని మనం అనుకుంటాం. కానీ మూర్ఖుడు దీనిని అర్థం చేసుకోలేడు. ఇటువంటివారు అనవసరంగా వాదనకు దిగుతారు. 


దుష్ట స్త్రీలకు దూరంగా ఉండండి

చాణక్య విధానం ప్రకారం దుష్ట స్త్రీలకు ఎప్పుడూ దూరంగా ఉండాలి. బురదలో రాళ్లు వేస్తే  బురద మనపైనే పడుతుందని, అదే విధంగా దుష్ట స్త్రీ ఎదుటివారి గౌరవానికి భంగం కలిగిస్తుందని ఆచార్య చాణక్య తెలిపారు. 

సంతోషంగా లేనివారి విషయంలో 

తనకు ఉన్నదానితో సంతోషంగా ఉండలేనివారికి దేవుడు కూడా సహాయం చేయలేడని చాణక్య తెలిపారు. ఇలాంటి వారు ఇతరుల పురోగతి, సంతోషాన్ని చూసి అసూయపడతారు. ఇలాంటి వారికి సహాయం చేయాలనుకునేవారు కష్టాల్లో చిక్కుకుంటారు. ఇలాంటి వారికి మేలు చేయడం బాధను కలిగిస్తుంది. అందుకే ఇటువంటివారికి దూరంగా ఉండాలని ఆచార్య చాణక్య తెలిపారు. 

Read more