ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పెళ్లి విందుకు పిలవలేదని పక్కింటి వ్యక్తుల నిర్వాకమిది.. నేరుగా భోజనాల వద్దకు వెళ్లి..

ABN, First Publish Date - 2022-05-14T00:13:13+05:30

కొన్నిసార్లు ఈగో కారణంగా చిన్న గొడవలు కూడా చాలా పెద్దవి అవుతుంటాయి. తీరా చివరకు విచారిస్తే కారణాలు చాలా సిల్లీగా ఉంటాయి. ఇలాంటి ఘటనే గ్వాలియర్‌లో జరిగింది. పెళ్లి విందుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కొన్నిసార్లు ఈగో కారణంగా చిన్న గొడవలు కూడా చాలా పెద్దవి అవుతుంటాయి. తీరా చివరకు విచారిస్తే కారణాలు చాలా సిల్లీగా ఉంటాయి. ఇలాంటి ఘటనే గ్వాలియర్‌లో జరిగింది. పెళ్లి విందుకు పిలవకపోవడాన్ని పక్కింటి వ్యక్తులు సీరియస్‌గా తీసుకున్నారు. ఎలాగైనా తన కోపాన్ని చూపించాలనుకున్నాడు. నేరుగా భోజనాల వద్దకు వెళ్లి అతడు చేసిన నిర్వాకం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. గ్వాలియర్‌లోని నాకా చంద్రబద్ని ప్రాంతంలో కదం సింగ్ అనే వ్యక్తి.. తన కుమారుడు లోకేంద్ర వివాహ కార్యక్రమం సందర్భంగా మే 11న రిసెప్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా బంధువులు, స్నేహితులు, సన్నిహితులను అందరినీ ఆహ్వానించాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అందరినీ ఆహ్వానించిన కదం సింగ్.. ఇరుగుపొరుగున ఉండే దిలీప్, సోను, ప్రమోద్, జితేంద్ర తదితరులను మాత్రం విస్మరించాడు. దీంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కావాలనే తమను విందుకు పిలవకుండా అవమానించారని భావించారు. ఎలాగైనా కార్యక్రమాన్ని చెడగొట్టాలని నిర్ణయించుకున్నారు. విందులో అంతా భోజనాలకు సిద్ధంగా ఉండగా.. లోపలికి ప్రవేశించారు.

అసలు వీళ్లు తల్లిదండ్రులేనా..? 11 ఏళ్ల కొడుకు ఉన్న గదిలోకి 22 శునకాలను పంపించి.. రెండేళ్లుగా..


లోపలికి వెళ్లీ వెళ్లగానే కోపంతో అక్కడున్న సామాన్లను విసిరికొట్టారు. భోజన పదార్థాలను చెల్లాచెదురుగా పడేశారు. ఊహించని ఈ పరిణామానికి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. స్థానికులు కొందరు కలుగజేసుకుని సర్దిచెప్పడంతో అప్పటికి వెళ్లిపోయారు. అయితే గురువారం వరుడి ఊరేగింపు కార్యక్రమానికి చేరుకుని మళ్లీ గొడవ సృష్టించారు. వరుడిని రథంపైకి ఎక్కకుండా అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా మహిళలపై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో వరుడి కుటుంబ సభ్యులు నేరుగా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదు చేశారు. స్పందించిన ఉన్నతాధికారులు పోలీసులను పంపించి, దగ్గరుండి కార్యక్రమాన్ని నిర్వహించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భర్త మృతదేహం పక్కనే కూర్చుని ఏడుస్తున్న భార్య.. కోడలి ప్రవర్తనపై అత్తింట్లో డౌట్.. పోస్ట్‌మార్టం చేయిస్తే..

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!