ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Super Star Krishna: కృష్ణగారు చనిపోయినప్పుడు నరేష్ ప్రవర్తనపై మండిపాటు

ABN, First Publish Date - 2022-11-24T12:23:38+05:30

పరిశ్రమలో నడుస్తున్న చర్చ ఏంటి అంటే, ఆరోజు నరేష్ హుందాగా వ్యవహరించలేదు అని, అతని వ్యవహార శైలి పరిశ్రమలోని చాలామందికి, కృష్ణ గారి కుటుంబ సభ్యులకి నచ్చలేదని తెలిసింది.

Naresh and Pavitra at the hospital
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) గారు చనిపోయేంత వరకు విజయనిర్మల కుమారుడు నరేష్ (Vijayanirmala's son VK Naresh) ఇంట్లోనే వున్నారు. కృష్ణ గారు పోయాక పార్థివ శరీరం నరేష్ ఇంటికే తీసుకెళ్లారు మొదట. అయితే పరిశ్రమలో నడుస్తున్న చర్చ ఏంటి అంటే, ఆరోజు నరేష్ హుందాగా వ్యవహరించలేదు అని, అతని వ్యవహార శైలి పరిశ్రమలోని చాలామందికి, కృష్ణ గారి కుటుంబ సభ్యులకి నచ్చలేదని తెలిసింది. ఆరోజు కృష్ణ గారిని చూడటానికి టాలీవుడ్ నుండి అలాగే మిగతా ప్రాంతాల నుండి వందలమంది సెలబ్రిటీస్, అభిమానులు వచ్చి తమ నివాళులు అర్పిస్తున్న సమయం లో నరేష్ హడావిడిగా అందరినీ అదేదో శుభ కార్యం అయినట్టు తనే వెళ్లి రిసీవ్ చేసుకునే విధానం పరిశ్రమలో ఎవరికీ నచ్చలేదు. అలాగే అభిమానులు కూడా చాలా నొచ్చుకున్నారు అతని వ్యవహార శైలి చూసి. అదీ కాకుండా నటి పవిత్రని కూడా అక్కడే కుటుంబ సభ్యులతో కూర్చేపెట్టడం అలాగే కొంతమందికి ఆమెని పరిచయం చేయించటం కూడా ఆ సమయం లో అది చాలా ఎబ్బెట్టుగా కనిపించింది అనీ పరిశ్రమలో ఒకటే టాక్ నడుస్తోంది. (Naresh's behavior is the talking point at his house while celebrities paying tribute to Krishna garu)

అందరూ విషాద వదనంలో ఉంటే, ఆ విషాద సమయం లో కూడా అతని ప్రవర్తన అందరికి ఆశ్చర్యపరిచింది. అంతలా ఓవర్ యాక్ట్ చేసాడని ఒక నిర్మాత, దర్శకుడు చెప్పారు. వాళ్ళు తమ పేర్లు చెప్పటం ఇష్టం లేదని, ఎందుకంటే తాము ఆ విషయం బయటకి చెప్పితే రచ్చ అవుతుందని చెప్పారు. అందువల్లే రెండో రోజు నుండి నరేష్ అంతగా ఎక్కడా కనపడలేదు. కృష్ణ గారి పార్థివ శరీరం ఎప్పుడయితే నరేష్ ఇంటి నుండి పద్మాలయ స్టూడియోస్ కి తెచ్చేసారో, ఇంకా అప్పటి నుండి నరేష్ కనిపించటం చాలా తగ్గింది. అభిమానులు, చిత్ర పరిశ్రమలోని వారు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు, అని తెలిసింది. అలాగే విజయవాడ కృష్ణా నదిలో కృష్ణ గారి అస్తికలు కలపడానికి వెళ్ళినప్పుడు కూడా నరేష్ ని తీసుకు వెళ్లొద్దు అని డిసైడ్ చేసుకోవటం కూడా చాల మంచి పని అని తెలిసింది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు వచ్చి మహేష్ బాబు మరియు అతని సిస్టర్స్ తో మాట్లాడుతున్నప్పుడు నరేష్ మధ్యలో జోక్యం చేసుకోవటం 'నువ్వు గమ్మునుండవోయి' అన్నట్టుగా కె.సి.ఆర్. గారు చెయ్యి నరేష్ కి అడ్డు పెట్టె వీడియో ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిన విషయమే. ఎప్పుడయినా నరేష్ గ్రహించి తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటాడు అని అనుకున్నారు కానీ, అతనిలో ఏమి తేడా లేదు.

ఇదే కాదు, నరేష్ అమ్మగారు విజయనిర్మల చనిపోయినప్పుడు కూడా అతను చేసిన చేష్టలు చూసి అందరూ నవ్వుకున్నారని కూడా చెప్పారు. అప్పట్లో చంద్రబాబు పరామర్శకు వచ్చినప్పుడు, చంద్రబాబుతో వున్న ఫోటోలు అన్నీ పెట్టి ఆ తరువాత ముఖ్యమంత్రి జగన్ పరామర్శకు వచ్చినపుడు చంద్రబాబు ఫొటోస్ తీసేసి జగన్, రాజశేఖర్ రెడ్డి తో వున్న ఫొటోస్ పెట్టి తన బుద్ధిని చాటుకున్నాడు. అది అప్పట్లో పెద్ద చర్చ అయింది, వైరల్ కూడా అయింది. ఇప్పుడు మళ్ళీ కృష్ణ గారు చనిపోయే సమయం లో కూడా అతను హుందాగా వుండ ఉంటే బాగుండేది అని, కానీ అతని ప్రవర్తన వలన అతని మీద గౌరవ భావం తగ్గే సూచనలు ఉన్నాయని పరిశ్రమలో అనుకుంటున్నారు. డబ్బు ఉంటే సరిపోదు అని, తగ్గట్టుగా ప్రవర్తన కూడా ఉండాలని అంటున్నారు పరిశ్రమలో పెద్దలు. (Pavitra Lokesh)

Updated Date - 2022-11-24T12:39:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising