-
-
Home » Prathyekam » Money was lost as soon as you downloaded this appsgr spl-MRGS-Prathyekam
-
Google Pay లో డబ్బులు పంపిందో మహిళ.. అవతలి వాళ్ల ఖాతాలో జమ కాలేదని తెలిసి ఆమె చేసిన ఒక్క మిస్టేక్తో..
ABN , First Publish Date - 2022-05-08T16:53:38+05:30 IST
ఆ మహిళ మున్సిపల్ కార్పొరేషన్ కు కట్టాల్సిన రూ.1383ను గూగుల్ పే ద్వారా జమ చేసింది.. డబ్బు కట్ అయినట్టు ఆమె మొబైల్ కు సందేశం వచ్చింది..

ఆ మహిళ మున్సిపల్ కార్పొరేషన్ కు కట్టాల్సిన రూ.1383ను గూగుల్ పే ద్వారా జమ చేసింది.. డబ్బు కట్ అయినట్టు ఆమె మొబైల్ కు సందేశం వచ్చింది.. కానీ సంబంధిత ఖాతాకు చెల్లింపు జరగలేదు.. దీంతో ఆమె గూగుల్లో గూగుల్ పే కస్టమర్ కేర్ నంబర్ గురించి సెర్చ్ చేసి కాల్ చేసింది.. లైన్ లోకి వచ్చిన వ్యక్తి మొబైల్ లో ఎనీ డెస్క్ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరాడు.. ఆమె అలాగే చేసింది.. ఆ యాప్ సాయంతో అతను ఆమె అకౌంట్ లో ఉన్న లక్ష రూపాయలు కొట్టేశాడు.. కస్టమర్ కేర్ నెంబర్ పేరుతో ఉన్న ఫేక్ నెంబర్ కు కాల్ చేయడమే ఆమె చేసిన తప్పు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాయ్ లో ఉంటున్న సరోజా జైస్వాల్ అనే మహిళ ఈ నెల 5వ తేదీన గూగుల్ పే ద్వారా దుర్గ్ మున్సిపల్ కార్పొరేషన్ ఖాతాకు రూ.1383 జమ చేసింది. డబ్బులు కట్ అయినట్టు సరోజ మొబైల్కు సందేశం కూడా వచ్చింది. అయితే సంబంధిత ఖాతాకు చెల్లింపు జరగలేదు. దీంతో సరోజ గూగుల్లో గూగుల్ పే కస్టమర్ కేర్ నంబర్ కోసం సెర్చ్ చేసింది. గూగుల్ పే కస్టమర్ కేర్ నంబర్ పేరుతో ఉన్న ఫేక్ నెంబర్ కు కాల్ చేసింది. లైన్ లోకి వచ్చిన వ్యక్తి మొబైల్ లో ఎనీ డెస్క్ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా సరోజను కోరాడు.
అతను చెప్పినట్టు సరోజ ఆ యాప్ ను డౌన్లోడ్ చేసింది. కొద్దిసేపటికే ఆ యాప్ సాయంతో అగంతకుడు ఆమె అకౌంట్ లో ఉన్న లక్ష రూపాయలను ఐదు విడతల్లో కొట్టేశాడు. ఎనీడెస్క్ అనే యాప్ ద్వారా మొబైల్ లేదా కంప్యూటర్ ను ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయ్యవచ్చు. ఆ విషయం తెలియని మహిళ రూ. లక్ష పోగొట్టుకుంది. తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.