ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఇలాంటి భర్తలు కూడా ఉంటారా..? ఇంత చిన్న కారణానికే భార్యకు గుండు గీశాడు.. వద్దని బ్రతిమిలాడుతున్నా..

ABN, First Publish Date - 2022-05-14T22:29:17+05:30

ప్రతి ఇంట్లో సాధారణంగా జరిగే పొరపాటే అది. కానీ ఆ భర్త సీరియస్‌గా తీసుకున్నాడు. భార్యను విపరీతంగా కొట్టడమే కాకుండా.. వద్దని ఎంత బ్రతిమిలాడుతున్నా.. వినిపించుకోకుండా ఆమెకు గుండు గీశాడు. స్థానికం

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఇంట్లో సాధారణంగా జరిగే పొరపాటే అది. కానీ ఆ భర్త సీరియస్‌గా తీసుకున్నాడు. భార్యను విపరీతంగా కొట్టడమే కాకుండా.. వద్దని ఎంత బ్రతిమిలాడుతున్నా.. వినిపించుకోకుండా ఆమెకు గుండు గీశాడు. స్థానికంగా ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


అహ్మదాబాద్‌కు చెందిన రిజ్వానా అనే మహిళకు ఇమ్రాన్‌నే వ్యక్తి సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇమ్రాన్ రోజు వారీ కూలీ. రోజూ పనికి వెళ్లి సంపాదిస్తున్న డబ్బులతోనే వారి కుటుంబం గడుస్తుంది. ఎప్పటిలాగే మే 8న పనికి వెళ్లిన అతడు.. మధ్యాహ్నం సమయానికి భోజనం చేయడానికి ఇంటికొచ్చాడు. దీంతో అప్పటికే సిద్ధం చేసిన కూరను, చపాతీని రిజ్వానా తన భర్తకు ముందుపెట్టింది. ఈ క్రమంలో కూర టేస్ట్ చూసి ఇమ్రాన్ ఆగ్రహానికి లోనయ్యాడు. 



కూరలో ఉప్పు(Salt) ఎక్కువైందని భార్యను ఇష్టమొచ్చినట్టు తిట్టాడు. అతడితో వాదించిన పాపానికి రిజ్వానాపై చేయి చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా బలవంతంగా ఆమెకు గుండు గీశాడు. రిజ్వానా కేకలు విని.. స్థానికలు అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇమ్రాన్ చేసిన పని చూసి షాకయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమెకు సూచించారు. అయితే తొలుత అందుకు నిరాకరించిన ఆమె.. మూడు రోజుల తర్వాత ధైర్యం చేసింది. భర్తకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వార్త ప్రస్తుతం చర్చనీయాంశం అయింది.  


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!