వీడేం ప్రియుడండీ బాబూ.. తండ్రి పోయిన బాధలో ప్రేయసి ఉంటే.. అంత్యక్రియలు జరుగుతున్న చోటే..

ABN , First Publish Date - 2022-05-13T19:22:45+05:30 IST

తమ ప్రేమను అమ్మాయికి చెప్పే విషయంలో అబ్బాయిలు ఎంతో మథన పడుతుంటారు.

వీడేం ప్రియుడండీ బాబూ.. తండ్రి పోయిన బాధలో ప్రేయసి ఉంటే.. అంత్యక్రియలు జరుగుతున్న చోటే..

తమ ప్రేమను అమ్మాయికి చెప్పే విషయంలో అబ్బాయిలు ఎంతో మథన పడుతుంటారు. మంచి సంద్భరం చూసుకుని, బహుమతి కొని లవ్ ప్రపోజ్ చేస్తుంటారు. అయితే దక్షిణాఫ్రికాకు చెందిన ఓ వ్యక్తి అలాంటి సెంటిమెంట్లను ఫాలో కాలేదు. తండ్రి చనిపోయి బాధలో ఉన్న మహిళకు స్మశానంలోనే ప్రపోజ్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అయ్యో.. మరీ ఇంత ఘోరమా.. తల్లి ఉరేసుకుని చనిపోయిందని తెలీక.. అమ్మ పాదాల వద్దే కూర్చుని ఏడుస్తూ..

మొజెలా అనే యువతి ఆ వీడియోను టిక్‌టాక్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ తన తండ్రి అంత్యక్రియల కోసం స్మశానానికి వెళ్లింది. విషాదంలో ఉన్న ఆమె వద్దకు చర్చిలో పని చేస్తున్న పాస్టర్ వచ్చాడు. ఆమె ముందు మోకాళ్ల మీద కూర్చుని.. `పెళ్లి చేసుకుంటావా` అని అడిగాడు. ఆమె చేతికి ఉంగరాన్ని తొడిగాడు. ఆమె ఆ సమయంలో తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఆ వ్యక్తి చేసిన పనిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 

Read more