భార్య కోసం పానీపూరీ తీసుకొచ్చిన భర్త.. బాత్రూమ్‌లో ఆమె పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్!

ABN , First Publish Date - 2022-05-13T06:06:21+05:30 IST

గర్భవతి అయిన భార్యకు పానీ పూరీ అంటే ఇష్టమని, ఆఫీసు పూర్తవగానే పనికట్టుకొని పానీపూరి కొన్నాడతను. ఇంటికి వెళ్లి చూస్తే కరెంటు లేదు. చీకటిగా ఉండడం చూసి భార్యను కేకవేసి పిలిచాడు. ఆమె సమాధానం ఇవ్వలేదు. కానీ బాల్కనీలో నుంచి వృద్ధురాలైన అతని తల్లి భయంగా కేకలు వేస్తూ కుమారుడిని పిలిచింది. దాంతో టెన్షన్ పెరిగిపోయిన అతను ఇంట్లోకి వెళ్లగానే దిమ్మతిరిగిపోయే...

భార్య కోసం పానీపూరీ తీసుకొచ్చిన భర్త.. బాత్రూమ్‌లో ఆమె పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్!

గర్భవతి అయిన భార్యకు పానీ పూరీ అంటే ఇష్టమని, ఆఫీసు పూర్తవగానే పనికట్టుకొని పానీపూరి కొన్నాడతను. ఇంటికి వెళ్లి చూస్తే కరెంటు లేదు. చీకటిగా  ఉండడం చూసి భార్యను కేకవేసి పిలిచాడు. ఆమె సమాధానం ఇవ్వలేదు. కానీ బాల్కనీలో నుంచి వృద్ధురాలైన అతని తల్లి భయంగా కేకలు వేస్తూ కుమారుడిని పిలిచింది. దాంతో టెన్షన్ పెరిగిపోయిన అతను ఇంట్లోకి వెళ్లగానే దిమ్మతిరిగిపోయే దృశ్యం కనిపించింది. ఇంటి బాత్రూంలో అతని భార్య మృతదేహం పడి ఉంది. ఈ ఘటన ఢిల్లీ ఎన్సీఆర్‌లోని ఘజియాబాద్‌లో వెలుగు చూసింది. 


స్థానికంగా ఉద్యోగం చేసే సంతోష్ కుమార్.. గత శుక్రవారం నాడు భార్య కోసం పానీపూరి తీసుకొని ఇంటికెళ్లాడు. ఇల్లంతా చీకటిగా ఉండటంతో భార్యను పిలిచాడు. బాల్కనీలో నుంచి అతని తల్లి భయంగా బదులిచ్చింది. లోపలకు వెళ్లి చూస్తే బాత్రూంలో అతని భార్య సంతోషీ ఉరఫ్ సోనీ మృతదేహం కనిపించింది. ఒక తీగను ఆమె మెడచుట్టూ చుట్టి ఊపిరాడకుండా చేసినట్లు గుర్తులు కనిపిస్తున్నాయి. సంతోష్ తల్లిని బాల్కనీలో బంధించిన గుర్తుతెలియని దుర్మార్గులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


తన ఇంటిపైన ఉండే కాంట్రాక్టర్ విపిన్‌, పక్కింట్లో పెయింటింగ్ పని చేసి నలుగురు యువకులపై అనుమానం వ్యక్తం చేశాడు సంతోష్. ఆ పెయింటింగ్ చేసే యువకులు తరుచూ నీళ్లు తాగేందుకు వచ్చేవారని చెప్పాడు. ఇంట్లో దొంగతనం కూడా జరిగిందని, చాలా విలువైన వస్తువులు పోయాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు.


Read more