ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Krithi Shetty: ఆలోచన మారింది.. గురి అటువైపే!

ABN, First Publish Date - 2022-11-11T17:21:30+05:30

ఏ హీరోయిన్‌కి అయినా ఓ సినిమా క్లిక్‌ అయిందంటే ఆఫర్లు వరుస కడుతుంటాయి. టాలీవుడ్‌లో అలా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాకు కృతీశెట్టి. తొలి చిత్రం ‘ఉప్పెన’లో బేబమ్మగా అలరించి భారీ విజయం సొంతం అందుకుందీ బెంగళూరు బ్యూటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏ హీరోయిన్‌కి అయినా ఓ సినిమా క్లిక్‌ అయిందంటే ఆఫర్లు వరుస కడుతుంటాయి. టాలీవుడ్‌లో అలా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాకు కృతీశెట్టి(Krithi Shetty). తొలి చిత్రం ‘ఉప్పెన’(Uppena)లో బేబమ్మగా అలరించి భారీ విజయం సొంతం అందుకుందీ బెంగళూరు బ్యూటీ. అంతే కాదు తెలుగు ఆడియన్స్‌లో పెద్ద ఫ్యాన్‌ బేస్‌ కూడా పెంచుకుంది. ‘ఉప్పెన’ విజయం వరుసగా అరడజను అవకాశాలు తీసుకొచ్చింది. నానితో ‘శ్యామ్‌ సింగ రాయ్‌’, బంగార్రాజు’ చిత్రాలు హిట్‌ కావడంతో హ్యాట్రిక్‌ విజయం సొంతం చేసుకుంది. తదుపరి మూడు చిత్రాలు రామ్‌ ‘ది వారియర్‌’ నితిన్‌ ‘మాచర్ల నియోజకవర్గం’, సుధీర్‌బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడ్డాయి. హ్యాట్రిక్‌ హిట్‌, హ్యాట్రిక్‌ ఫ్లాప్‌తో రిస్క్‌లో పడింది కృతి. దీంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఓకే అనకుండా ఆచితూచి అడుగేయాలనే ఆలోచనకు వచ్చినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం అంగీకరించే సినిమాలకు కాస్త టైమ్‌ తీసుకొవాలనుకుంటుందట. ప్రస్తుతం కృతీశెట్టి నాగ చైతన్య – వెంకట్‌ ప్రభు కాంబినేషన్‌లో తెలుగు, తమిళంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది కాకుండా మలయాళంలో ఓ సినిమా చేస్తున్నారు. సినిమాల కౌంట్‌ కన్నా... క్వాలిటీ ముఖ్యం అని గ్రహించిన కృతీ తన పంథా మార్చుకుని కథా బలమున్న, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు వైపు గురి పెట్టినట్లు తెలిసింది. (Krithi Shetty Changed her route)


Updated Date - 2022-11-11T17:21:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising