ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

చాణక్యనీతి: ఈ పనులు చేయకపోతే.. శత్రువులు చుట్టుముడతారు!

ABN, First Publish Date - 2022-05-07T13:08:31+05:30

చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం మనిషి విజయం...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం మనిషి విజయం సాధించినప్పుడు ఆనందం, శ్రేయస్సు పొందుతాడు. అయితే దీనివల్ల ఇతరులకు  అతనిపై అసూయ, శత్రుభావం మొదలవుతుంది. అటువంటి స్థితిలో విజయం సాధించినవారికి అడ్డంకులు సృష్టించడానికి అసూయాపరులు ప్రయత్నిస్తారు. ఇటువంటివారిని ఎదుర్కొనేందుకు ఆచార్య చాణక్య కొన్ని కీలక విషయాలు తెలియజేశారు.  వీటిని అనుసరించడం ద్వారా శత్రువును ఓడించవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.  


మీలోని లోపాలను తొలగించుకోండి

చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం శత్రువులు అనునిత్యం మన బలహీనమైన పరిస్థితులను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే శత్రువును విస్మరించకూడదు. ఒక వ్యక్తి అజాగ్రత్తగా ఉన్నప్పుడు, శత్రువు కదలికలపై నిఘా పెట్టనప్పుడు శత్రువు మనపై దాడి చేస్తాడు. ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం ప్రతి విజయవంతమైన వ్యక్తికి తప్పనిసరిగా ఒక్క శత్రువు అయినా ఉంటాడు. ఈ శత్రువులు విజయాన్ని అడ్డుకుంటారు. ఎప్పటికప్పుడు పనులకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేస్తుంటారు. శత్రువులు ఎల్లప్పుడూ విజయ మార్గంలో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. శత్రువును ఓడించడానికి, వారి చర్యలను నివారించడానికి చాణక్యుడు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాడు. వీటిని మనిషి నిరంతరం గుర్తుంచుకోవాలి. 

ప్రతిభకు పదును పెట్టండి

ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం మీరు శత్రువును ఓడించాలనుకుంటే, మీరు మీ ప్రతిభను పెంచుకునేందుకు నిరంతరం ప్రయత్నించాలి.  ఫలితంగా శత్రువు  మీకుహాని కలిగించాలనుకుంటే చాలాసార్లు ఆలోచించవలసి వస్తుంది. మీలోని శక్తియుక్తులు బలహీనపడినప్పుడు శత్రువు దాడి చేయడం గురించి ఆలోచిస్తాడు. అందుకే మనిషి నిరంతరం నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నించడం చేస్తుండాలి.  

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!