ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Krishna-Mahesh: కృష్ణగారు అచ్చం ఎలా వున్నారంటే?

ABN, First Publish Date - 2022-11-22T13:21:47+05:30

కృష్ణ గారి మొదటి సరి సినిమా కోసం తీసుకున్న ఫొటోస్, అలాగే కృష్ణ గారు మొదటి సారి మేక్ అప్ వేసుకున్న ఫోటోస్ ఇలాంటివి అన్నీ ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ గా తిరుగుతున్నాయి

File photos of Krishna and Mahesh Babu
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణ గారి మొదటి సరి సినిమా కోసం తీసుకున్న ఫొటోస్, అలాగే కృష్ణ గారు మొదటి సారి మేక్ అప్ వేసుకున్న ఫోటోస్ ఇలాంటివి అన్నీ ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ గా తిరుగుతున్నాయి. అయితే ఇంకో అరుదయిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అయింది. కృష్ణ గారి చిన్నప్పటి ఫోటో ఒకటి అతని అభిమానులు తమ సాంఘీక మాధ్యమాల్లో పోస్ట్ చేసారు. ఆ ఫోటో చూస్తే కృష్ణ గారు అచ్చం మహేష్ బాబులా వున్నారు అందులో. కొన్ని కొన్ని సినిమాల్లో మహేష్ బాబు అభినయం, హావభావం, గొంతు ఒక్కో సారి కృష్ణ గారు అప్పట్లో ఎలా చేసేవారో అలానే కనిపిస్తూ ఉంటుంది. అలాగే కృష్ణ గారి అందం అంతా మహేష్ బాబు కి వచ్చింది. కృష్ణ గారు మొదట్లో ఎంత అందంగా ఉండేవారో, ఇప్పుడు మహేష్ బాబు కూడా అంతే అందంగా కనపడుతూ ఉంటాడు.

అలంటి ఒక పాత నలుపు తెలుపు కృష్ణ గారి ఫోటో వైరల్ అయింది. కొంతమంది అభిమానులు అయితే ఆ ఫోటో చూసి అది అచ్చం మహేష్ బాబు మురారి సినిమాలో అలానే వున్నాడు అని, లేదు మహేష్ బాబు మొదట్లో అలానే ఉండేవాడు అని ఇలా కామెంట్స్ చేస్తూ వున్నారు. ఏమయినా కూడా కృష్ణ గారు మహేష్ బాబు ఇద్దరూ తండ్రి కొడుకులు కదా, తండ్రి పోలికలు సహజంగానే కొడుక్కి వస్తాయి. కానీ ఇక్కడ తమాషా ఏంటి అంటే, ఫోటోలో కృష్ణ గారు మహేష్ బాబు లా ఒకేలా ఉండటం. కృష్ణ గారి చిన్నప్పటి ఫోటో చూస్తుంటే, మహేష్ బాబు ని చూస్తున్నట్టు ఉంటుంది. అందుకే ఈ ఫోటో బాగా వైరల్ అయింది.

Updated Date - 2022-11-22T13:23:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising