అయ్యో.. మరీ ఇంత ఘోరమా.. తల్లి ఉరేసుకుని చనిపోయిందని తెలీక.. అమ్మ పాదాల వద్దే కూర్చుని ఏడుస్తూ..

ABN , First Publish Date - 2022-05-13T18:14:18+05:30 IST

ఆ ఏడాదిన్నర కుమారుడు తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు.. బుధవారం ఉదయం నిద్రలేచిన బాలుడు ఏకధాటిగా నాలుగు గంటల పాటు ఏడుస్తూనే ఉన్నాడు..

అయ్యో.. మరీ ఇంత ఘోరమా.. తల్లి ఉరేసుకుని చనిపోయిందని తెలీక.. అమ్మ పాదాల వద్దే కూర్చుని ఏడుస్తూ..

ఆ ఏడాదిన్నర కుమారుడు తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు.. బుధవారం ఉదయం నిద్రలేచిన బాలుడు ఏకధాటిగా నాలుగు గంటల పాటు ఏడుస్తూనే ఉన్నాడు.. బాబు ఎంతకీ ఏడుపు ఆపకపోవడంతో చుట్టుపక్కల వాళ్లు ఏం జరిగిందా అని లోపలికి వెళ్లి చూశారు. లోపల తల్లి ఉరేసుకుని చనిపోయింది.. ఆమె చనిపోయిందని తెలీక ఏడాదిన్నర కుమారుడు ఆమెను పిలుస్తూ ఏడుస్తున్నాడు.. తండ్రి ఎక్కడికి వెళ్లాడని చూస్తే అతను బాత్రూమ్‌లో ఉరేసుకుని చనిపోయాడు.. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 


Viral Video: ఒకేసారి రెండు గ్లాసుల్లోకి నాలుకను పెట్టగలరా..? కానీ ఈ మహిళ మాత్రం చేసి చూపించింది..!
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా గఢకోటలో నేపాలీ దంపతులు కేసర్ సాహుద్ (28), భార్య పశుపతి సాహుద్ (24) తమ ఏడాదిన్నర వయసున్న కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. వీరు చైనీస్ ఫుడ్ విక్రయిస్తుంటారు. మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో వారు రాత్రి సమయంలోనే ఉరేసుకున్నారు. బుధవారం ఉదయం 8 గంటల తర్వాత ఏడాదిన్నర బాబు ఏడుపు శబ్దం వస్తూనే ఉంది. ఇరుగుపొరుగు వారు కిటికీలోంచి చూడగా మహిళ ఉరికి వేలాడుతూ కనిపించింది. తల్లిని పట్టుకుని పిలుస్తూ కొడుకు ఏడుస్తున్నాడు. ఆ మహిళ భర్త మృతదేహం బాత్‌రూమ్‌లో వేలాడుతూ కనిపించింది. ఇద్దరూ చీరలతో ఉరి వేసుకున్నారు.


దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. పరస్పరం గొడవ పడిన భార్యాభర్తలిద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. 

Read more