ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కొడుకు కోడలిపై ఓ తల్లి వింత కేసు.. పెళ్లయి ఆరేళ్లయినా మనవడిని ఇవ్వలేదు.. రూ.5 కోట్ల పరిహారమివ్వండంటూ..

ABN, First Publish Date - 2022-05-12T20:42:00+05:30

కొడుకు కోడలిపై ఓ తల్లి వింత కేసు పెట్టింది. వివాహం జరిగి ఆరేళ్లు గడిచినా మనవడిని ఇవ్వలేదంటూ ఫిర్యాదు చేసింది. అందుకు పరిహారంగా రూ.5కోట్లు ఇప్పించాలని కోర్టును కోరింది. చర్చనీయాంశం అయిన

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఇంటర్నెట్ డెస్క్: కొడుకు కోడలిపై ఓ తల్లి వింత కేసు పెట్టింది. వివాహం జరిగి ఆరేళ్లు గడిచినా మనవడిని ఇవ్వలేదంటూ ఫిర్యాదు చేసింది. అందుకు పరిహారంగా రూ.5కోట్లు ఇప్పించాలని కోర్టును కోరింది. చర్చనీయాంశం అయిన ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తరఖండ్‌‌కు చెందిన దంపతులు.. తమ కుమారుడికి ఓ మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి జరిపించారు. అనంతరం మరింత డబ్బులు ఖర్చు చేసి హనీమూన్ కోసం థాయ్‌లాండ్ పంపారు. ఆ తర్వాత అందరు తల్లిదండ్రుల లాగానే ఆ దంతపతులు కూడా మనవడో మనవరాలో పుడుతుందని వేయి కళ్లతో ఎదురు చూశారు. ఇలానే ఆరేళ్లు గడిచిపోయాయి.  రోజులు గడిచినా కానీ కొడుకు కోడలు నుంచి ఆ శుభవార్త మాత్రం రాలేదు. దీంతో ఆ దంపతులు విసిగిపోయారు. ఈ క్రమంలోనే కొడుకు, కోడలికి వ్యతిరేకంగా తల్లి హరిద్వార్ జిల్లా కోర్టును ఆశ్రయించింది. 



పెళ్లై ఆరేళ్లు గడిచినా కొడుకూ, కోడలు తనకు మనవడిని ఇవ్వలేదంటూ వారిద్దరిపై గృహహింస కేసు పెట్టింది. ఆరేళ్లుగా మానసికంగా చిత్రహింసలకు లోనైనట్టు పేర్కొంది. కొడలి తల్లిదండ్రులు తన కొడుకును ప్రభావితం చేస్తున్నట్టు ఆరోపించింది. కొడుకు, కోడలికి మరో ఏడాది గడువు ఇస్తున్నాని.. ఈలోగా తన చేతిలో పండంటి బిడ్డను పెట్టాలని డిమాండ్ చేసింది. ఒకవేళ ఇందులో వాళ్లు విఫలం అయితే కొడుకు, కోడలి నుంచి పరిహారం ఇప్పించాలని కోర్టును కోరింది. కొడుకు ఉన్న చదువులు, పెళ్లి తదితరాలకు ఇప్పటి వరకు రూ.2కోట్లు ఖర్చు చేశానని.. అందువల్ల తనకు పరిహారంగా రూ.5కోట్ల పరిహారం ఇప్పించాలని అభ్యర్థించింది. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!