ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

చాణక్య నీతి: ఈ నాలుగు పనుల తర్వాత స్నానం తప్పనిసరి.. లేదంటే..

ABN, First Publish Date - 2022-05-05T11:45:35+05:30

నాటి ఆర్థికవేత్త. పండితుడు అయిన ఆచార్య...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

నాటి ఆర్థికవేత్త. పండితుడు అయిన ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో అనేక జీవన విధానాలను వివరించాడు. ఆచార్య చాణక్యుడి విధానాలు నిజ జీవితంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ విధానాలను అనుసరించడం ద్వారా, ఒక వ్యక్తి తన పనిలో విజయం సాధించగలుగుతాడు. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ప్రస్తావించాడు. చాలా సంవత్సరాల క్రితం ఆయన రాసిన విధానాలు నేటికీ అందరికీ వర్తించేలా ఉన్నాయి. ఈ విధానాల సారాంశాన్ని అర్థం చేసుకుని, వాటిని జీవితంలో అమలు చేస్తే, మనిషి సంతోషంగా, సంతృప్తిగా, విజయవంతమైన జీవితాన్ని గడపవచ్చు. ఆచార్య చాణక్యుడు అలాంటి నాలుగు పనులు చేశాక స్నానం తప్పనిసరిగా చేయాలని అన్నాడు. ఆ పనులేమిటో ఇప్పుడు చూద్దాం. 



శరీర మర్దన అనంతరం

ఆచార్య చాణక్యుడు ఒక శ్లోకంలో తెలిపిన వివరాల ప్రకారం  శరీరాన్ని నూనెతో మసాజ్ చేసిన తర్వాత, తప్పనిసరిగా స్నానం చేయాలి. ఆయిల్‌ను శరీరంపై మర్దన చేసిన తర్వాత రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది. అలాగే జుట్టు కుదుళ్ల నుండి చెమట రావడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత తప్పక తలస్నానం చేయాలి.

అంత్యక్రియలు లేదా శ్మశాన వాటిక నుండి వచ్చాక

అంత్యక్రియల ఊరేగింపు లేదా శ్మశానవాటిక నుండి తిరిగి వచ్చిన తర్వాత స్నానం చేయాలి. ఎందుకంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఆ మృతదేహంలో అనేక రకాల సూక్ష్మక్రిములు వ్యాపించడం ప్రారంభిస్తాయి. అటువంటి స్థితిలో మృతదేహాన్ని తాకినట్లయితే ఆ సూక్ష్మక్రిములు స్పర్శ ద్వారా లేదా గాలి మన శరీరంలోకి, దుస్తులలోకి కూడా ప్రవేశిస్తాయి. అందుకే అంత్యక్రియల ఊరేగింపు లేదా శ్మశాన వాటిక నుండి వచ్చిన తర్వాత స్నానం చేయడం, వేసుకున్న బట్టలు ఉతకడం ఎంతో ముఖ్యం.

శారీరక సంబంధం తర్వాత 

స్త్రీ అయినా, పురుషుడైనా శారీరక సంబంధం తర్వాత స్నానం చేయకపోతే వారిలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శారీరక సంబంధం అనంతరం తప్పనిసరిగా స్నానం చేయాలి. శుభ్రమైన శరీరం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆరోగ్యవంతమైన శరీరానికి స్నానం తప్పనిసరి అని చాణక్యుడు చెప్పాడు. శారీరక సంబంధం తర్వాత శరీరం అపవిత్రం అవుతుందనే భావన ఉండి కాబట్టి తప్పనిసరిగా స్నానం చేయాలి.

జుట్టు కత్తిరించిన తర్వాత 

హెయిర్‌కటింగ్‌ చేయించుకుని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత స్నానం చేయడం మర్చిపోవద్దు. వెంట్రుకలు శరీరానికి అంటుకుంటాయి. అవి స్నానం చేయకపోతే శరీరాన్ని విడిచిపెట్టవని చాణక్య తెలిపాడు. చిన్నపాటి వెంట్రుకలు కడుపులోకి వెళితే అవి శారీరక అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఇది ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!