ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Viral News: ఒకే ఒక్క నిర్ణయం.. రైతు జీవితాన్నే మార్చేసింది.. లక్షధికారిని చేసేసింది!

ABN, First Publish Date - 2022-05-06T02:09:05+05:30

ఆయన ఒక సామాన్య రైతు. రోజూ పని చేయనిదే ఆయన ఇల్లు గడవదు. కానీ కేవలం ఒకే ఒక్క నిర్ణయం ఆయన జీవితాన్నే మార్చేసింది. ఆర్థిక ఇబ్బందులను తొలగించి, లక్షధికారిని చేసింది. కాగా.. ఇంతకూ ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఇంటర్నెట్ డెస్క్: ఆయన ఒక సామాన్య రైతు. రోజూ పని చేయనిదే ఆయన ఇల్లు గడవదు. కానీ కేవలం ఒకే ఒక్క నిర్ణయం ఆయన జీవితాన్నే మార్చేసింది. ఆర్థిక ఇబ్బందులను తొలగించి, లక్షధికారిని చేసింది. కాగా.. ఇంతకూ ఆయన ఎవరు? తీసుకున్న నిర్ణయం ఏంటి? లక్షాధికారి ఎలా అయ్యారు? అనే వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన ప్రతాప్ సింగ్ యాదవ్ అనే రైతు సుమారు మూడు నెలల క్రితం కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని పట్టి అనే ప్రాంతంలో కొంత భూమిని లీజుకు తీసుకుని అందులో వజ్రాలను వెతికే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఆయనకి ఓ వజ్రం దొరిగింది. ప్రతాప్ సింగ్ యాదవ్ దాన్ని పట్టుకుని నేరుగా డైమండ్ ఆఫీసర్ వద్దకు వెళ్లారు. ఆ అధికారి వజ్రం నాణ్యతను పరీక్షించి రైతుకు శుభవార్త చెప్పారు. దొరికింది 11.88 క్యారెట్ల నాణ్యమైన వజ్రం అని చెప్పడమే రైతు సంతోషం వ్యక్తం చేశారు. 



ఇదిలా ఉంటే.. బహిరంగ వేలంలో ఈ వజ్రం విలువ రూ.50 లక్షల వరకు పలుకుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రతాప్ సింగ్ యాదవ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చట్టబద్ధంగా తనకు వచ్చే డబ్బు ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించినున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా భవిష్యత్తు అవసరాల కోసం కొంత మొత్తాన్ని దాచుకోనున్నట్లు వెల్లడించారు. కాగా.. ప్రస్తుతం ఈ వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!