ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

అమ్మాయిని ప్రేమించాడని.. ప్రియుడి తండ్రిని చావబాదిన కుటుంబం

ABN, First Publish Date - 2022-05-09T09:37:24+05:30

తమ అమ్మాయిని ఒక యువకుడు ప్రేమించాడని, వాళ్లిద్దరూ కలిసి పారిపోయారని తెలిసిన ఆ కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. అబ్బాయి వివరాలు తెలుసుకొని, అతని తండ్రితో వాగ్వాదానికి దిగారు. తన వల్ల కుటుంబానికి ఇబ్బంది వస్తోందని తెలుసుకున్న సదరు ప్రేమికుడు.. అమ్మాయితో సహా తిరిగి వచ్చేశాడు. అమ్మాయిని వాళ్ల ఇంటికి పంపేశాడు. అయితే ఆమె కుటుంబ సభ్యుల ఆగ్రహం మాత్రం ఏమాత్రం చల్లారలేదు...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

తమ అమ్మాయిని ఒక యువకుడు ప్రేమించాడని, వాళ్లిద్దరూ కలిసి పారిపోయారని తెలిసిన ఆ కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. అబ్బాయి వివరాలు తెలుసుకొని, అతని తండ్రితో వాగ్వాదానికి దిగారు. తన వల్ల కుటుంబానికి ఇబ్బంది వస్తోందని తెలుసుకున్న సదరు ప్రేమికుడు.. అమ్మాయితో సహా తిరిగి వచ్చేశాడు. అమ్మాయిని వాళ్ల ఇంటికి పంపేశాడు. అయితే ఆమె కుటుంబ సభ్యుల ఆగ్రహం మాత్రం ఏమాత్రం చల్లారలేదు. దీంతో అబ్బాయి కుటుంబంపై పగ పెంచుకొని దాడి చేశారు. ఈ ఘటన బిహార్‌లోని బగహా ప్రాంతంలో వెలుగు చూసింది. 


స్థానికంగా ఉండే ఓం ప్రకాష్ అనే యువకుడు ఒక యువతిని ప్రేమించాడు. అమ్మాయి కుటుంబం తమ పెళ్లికి అంగీకరించదని తెలిసి, ఆమెను తీసుకొని పరారయ్యాడు. ఈ విషయం తెలిసిన యువతి కుటుంబం.. ఓం ప్రకాష్ తండ్రితో గొడవ పడింది. ఈ పగలు పెరిగిపోతున్నాయని తెలిసిన ఓం ప్రకాష్.. తిరిగి ఊరికి వచ్చేశాడు. అమ్మాయిని వాళ్ల ఇంటికి పంపేశాడు. అమ్మాయి ఇంటికి వచ్చేసినా ఆ కుటుంబం పగ చల్లారలేదు. ఇటీవల ఉదయాన్నే నిద్రలేచి పొలం పనుల కోసం వెళ్తున్న ఓం ప్రకాష్ తండ్రిని అమ్మాయి కుటుంబ సభ్యులు వెంబడించారు. పొలం వద్ద అతడిని పరుష పదజాలంతో దూషిస్తూ గొడవకు దిగారు. అనంతరం అందరూ కలిసి ఆ వృద్ధుడిపై దాడి చేశారు.  

వాళ్ల నుంచి తప్పించుకొని ఇంటి వరకూ వచ్చిన ఆ వృద్ధుడు.. ఇంటి తలుపుల ముందే పడిపోయి మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని, పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!