ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఫేస్‌బుక్‌లో పరిచయమైన పక్కింటి కుర్రాడు.. పెళ్లి పేరు చెప్పి మోసం.. తల్లికి చెప్పడంతో

ABN, First Publish Date - 2022-05-03T09:00:26+05:30

ప్రస్తుతం యువతీ యువకులు అందరూ సోషల్ మీడియాలోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలో కొత్త పరిచయాలు ఏర్పడుతున్నాయి. అయితే ఒక్కోసారి ఈ పరిచయాలు అపాయంగా మారుతున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ప్రస్తుతం యువతీ యువకులు అందరూ సోషల్ మీడియాలోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలో కొత్త పరిచయాలు ఏర్పడుతున్నాయి. అయితే ఒక్కోసారి ఈ పరిచయాలు అపాయంగా మారుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఇలాంటి ఘటనేవెలుగు చూసింది. 


స్థానికంగా నివసించే ఒక యువతికి ఫేస్‌బుక్‌లో రిషి అనే యువకుడు పరిచయం అయ్యాడు. అతను తమ లొకాలిటీలోనే ఉంటాడని తెలియడంతో ఇద్దరూ కలిశారు. ఈ క్రమంలోనే ఆమెను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన రిషి.. యువతితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. దీన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆ వీడియో చూపించి ఆమెను నెలల తరబడి బలాత్కరించాడు. ఆమె ఎప్పుడు ప్రతిఘటించినా వీడియో వైరల్ చేసేస్తానని బెదిరించేవాడు. 


చివరకు ఆ యువకుడు పెట్టే చిత్రహింసలు భరించలేక విషయం తన తల్లికి ఆమె చెప్పేసింది. దీంతో ఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న వాళ్లు.. సదరు యువకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!