ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Chinese companies విచిత్ర ఆఫర్.. ఏడాది పాటు సెలవులు.. రూ.11.50 లక్షల బోనస్.. కానీ ఒకే ఒక్క కండీషన్..!

ABN, First Publish Date - 2022-05-06T22:40:22+05:30

జనాభా పరంగా ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉన్న చైనాలో గతంలో జనాభా నియంత్రణను పాటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

జనాభా పరంగా ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉన్న చైనాలో గతంలో జనాభా నియంత్రణను పాటించారు. `వన్‌ ఛైల్డ్‌` విధానాన్ని కఠినంగా అవలంబించడంతో క్రమంగా చైనా జనన రేటు తగ్గుతూ వచ్చింది. ఈ తరుగుదల ప్రమాదకర స్థాయికి చేరడంతో 2016లో ఇద్దరు పిల్లల విధానం తీసుకువచ్చారు. అయినా జనన రేటు ఆశించినంతగా ఉండకపోవడం, 60 ఏళ్ల పైబడిన వారి సంఖ్య పెరుగుతుండడంతో గతేడాది ముగ్గురు పిల్లల విధానం తెచ్చారు. మూడో బిడ్డను కంటే ఏడాదికి దాదాపు 90 వేల యువాన్లు ఇవ్వాలని ఆర్థికవేత్తలు ప్రభుత్వానికి సూచించారు. 


చైనా తెచ్చిన చట్టానికి మద్దతుగా ఓ కంపెనీ తన ఉద్యోగులకు బంపరాఫర్లు ప్రకటించింది. బీజింగ్‌లోని దబీనాంగ్ టెక్నాలజీ గ్రూప్ సంస్థ తన ఉద్యోగుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రకారం మూడో బిడ్డకు జన్మనిచ్చే మహిళకు ఏడాది పాటు సెలవు లభిస్తుంది. పురుషుడికి 9 నెలల సెలవు లభిస్తుంది. దీనితో పాటు 90,000 చైనీస్ యువాన్లు (దాదాపు 11.50 లక్షల రూపాయలు) రివార్డును కూడా సంస్థ చెల్లిస్తుంది. ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులు మొదటి బిడ్డను కంటే రూ.3.50 లక్షలు, రెండో బిడ్డను కంటే రూ.7 లక్షలు, మూడో బిడ్డను కంటే రూ.11.50 లక్షలు చెల్లిస్తారు. 


చైనాలో జనాభా తరుగుదల కారణంగా 2027 నాటికి జనాభా పరంగా చైనాను భారత్‌  దాటేస్తుందని ఐరాస అంచనా వేసింది. చైనా నిపుణులు సైతం 2027నుంచి చైనా జనాభాలో తరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు.  దీనివల్ల వినియోగ డిమాండ్‌ తగ్గిపోతుందని భావించిన ప్రభుత్వం అందుకనుణంగా తన విధాన నిర్ణయాలను మార్చుకుంది. ప్రభుత్వం తన విధానాలు సమీక్షించుకోకపోతే 2050 నాటికి వృద్ధుల పరిరక్షణకు అమెరికా కన్నా చైనా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుందని చైనా పీపుల్స్‌ బ్యాంక్‌ హెచ్చరించింది. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!